Tadepalle: అర్థరాత్రి చప్పుడు కాకుండా స్మశాన వాటికకు వచ్చిన దొంగలు… ఊహించని విధంగా..
వీళ్ల కంటే చిల్లర దొంగలు ఉంటారా చెప్పండి. మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఆఖరీ మజిలీలు చేరే స్మశానవాటికను కూడా వదిలిపెట్టడం లేదు. ఈ వెదవలు ఏం చేశారో తెలుసుకుందాం పదండి...
దొంగలు బాబోయ్ దొంగలు… ఆషామాషీ దొంగలు కాదు.. ఆఖరు మజిలీ కూడా అంత తేలిక కాదు అనిపించేలా చేస్తున్న చోరులు. చనిపోయిన శవాలకు సైతం భయం పుట్టిస్తున్నారు. ఏంటనుకుంటున్నారా… అయితే తాడేపల్లి మండలం పెనమాకలో జరిగిన ఈ వింత దొంగతనం గురించి తెలుసుకోవాల్సిందే. స్మశానవాటికను కూడా వదలకుండా దొంగలు చోరీకి పాల్పడ్డారు. మృతదేహాలను ఖననం చేసే బెడ్ గ్రిల్స్ దొంగలించుకుపోయారు. బడి, గుడి, ఇల్లు ఇలాంటి వాటికి భద్రత కల్పించుకుంటాం. కాని స్మశాన వాటికకు రక్షణ కల్పించాల్సిందేనని చాటి చెప్పారు నయా చోరులు. లక్షా యాబై వేల రూపాయల విలువైన ఐరన్ గ్రిల్స్ ను అపహరించుకుపోయారు.
గ్రిల్స్ దొంగలించడం తో మృతదేహానికి దహన సంస్కారాలు చేయాలి అంటే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని నిర్వాహకులు తెలిపారు. గ్రిల్స్ మీద మృతదేహాన్ని ఉంచి దహనం చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుందని గ్రిల్స్ లేకపోవడంతో ఎక్కువ పుల్లలు పేర్చి దహన సంస్కారాలు చేయాల్సి వస్తుందంటున్నారు. అయితే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌లు ఎక్కువయ్యాయని వారిలో ఎవరో ఒకరు వీటిని అపహరించుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పాత ఐరన్‌కు కూడా మంచి ధర వస్తుందని దీంతో మద్యం సేవించడానికి, గంజాయి తాగడానికి డబ్బుల్లేని ముఠాలే వీటిని అపహరించి ఉంటాయని అనుకుంటున్నారు.
ఏది ఏమైనా స్మశాన వాటికలోని గ్రిల్స్ దొంగతనం పై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏవిధంగా దొంగలను పెట్టుకుంటారో వేచి చూడాల్సిందే.
—రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..