Fraud: ఆన్‌లైన్ జూదం కోసం రైతుల సొమ్ము స్వాహా.. బంధుమిత్రుల కలిసి రూ. కోట్లు మాయం చేసిన‌ పోస్ట్ మాస్టర్!

ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్‌లో కోటి రూపాయలకు పైగా పత్తి రైతుల సొమ్మును పక్కదారి పట్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ దారిలో కాజేసి‌న ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కేసులో తవ్వి‌న కొద్ది‌ అసలు బండారం బయటపడుతోంది. అమాయకులైన రైతులను బురిడి కొట్టించి, రైతుల జాబ్ కార్డ్ ఖాతాల్లోని లక్షల సొమ్మును అప్పనంగా కాజేశాడు.

Fraud: ఆన్‌లైన్ జూదం కోసం రైతుల సొమ్ము స్వాహా.. బంధుమిత్రుల కలిసి రూ. కోట్లు మాయం చేసిన‌ పోస్ట్ మాస్టర్!
Post Office
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 02, 2024 | 1:10 PM

ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్‌లో కోటి రూపాయలకు పైగా పత్తి రైతుల సొమ్మును పక్కదారి పట్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ దారిలో కాజేసి‌న ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కేసులో తవ్వి‌న కొద్ది‌ అసలు బండారం బయటపడుతోంది. అమాయకులైన రైతులను బురిడి కొట్టించి, రైతుల జాబ్ కార్డ్ ఖాతాల్లోని లక్షల సొమ్మును అప్పనంగా కాజేశాడు. ఈ కేసులో మేనేజర్ కు సహకరించిన పోస్ట్ ఆఫీస్ లోని మరో ఉద్యోగిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న మేనేజర్ విజయ్ బందువైన చౌహాన్ పురుషోత్తంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతుల డబ్బులను దారి మళ్లించి అక్రమాలకు పాల్పడ్డ ఐపీపీబీ మేనేజర్ విజయ్ జాదవ్ కు పురుషోత్తం సహకరించినట్లు తేలింది. దీంతో ఏ-2 నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. పురుషోత్తం అకౌంట్ నుండే రూ. 15 లక్షలకు పైగా రైతుల‌ డబ్బులు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా రైతులకు రావాల్సిన డబ్బులను జాబ్ కార్డ్‌లో జమ చేయగా, ఆ డబ్బులను అక్రమ దారిలో వీరిద్దరు కలిసి మాయం చేసినట్టు పోలీసులు తేల్చారు.

ఈ ఇద్దరే కాదు పత్తి‌రైతులను నిండా ముంచి‌న ఈ కేసులో కిలాడీ మేనేజర్ విజయ్ భార్య, మామ కూడా నిందితులే అని పోలీసులు తేల్చారు. మార్చి 22న కోర్ట్ లో లొంగిపోయిన నిందితుడు విజయ్ జాదవ్ ను పోలీసులు కస్టడికి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోటికి పైగా రైతుల‌ డబ్బులను అక్రమ మార్గంలో తన కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి మళ్లించి ఆ డబ్బుతో భార్య, మామకు చెందిన బంగారాన్ని బ్యాంక్ నుండి తాకట్టు విడిపించినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 50 లక్షలతో ఆన్‌లైన్ జూదం ఆడిన ఆదిలాబాద్ పోస్ట్ ఆపీస్ మేనేజర్ విజయ్ జాదవ్.. రూ. 40 లక్షలకు పైగా జూదంలో పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.

నిందితుడు.. విజయ్ మామ జాదవ్ నందులాల్ ఇంద్రవెల్లి పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. నిందితుడు విజయ్ భార్య మహేశ్వరి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరికి చెందిన 24 తులాల బంగారాన్ని‌ కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు తీసుకున్నాడు విజయ్. ఆ వచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ జూదం ఆడిన నిందితుడు ఆ డబ్బులు పోవడంతో రైతుల డబ్బులను వినియోగించి బ్యాంకులోని మామ, భార్య పేరిట తాకట్టు‌లో ఉన్న బంగారాన్ని విడిపించాడు. నగలను బ్యాంకు నుంచి విడిపించుకోవటానికి రైతుల డబ్బులు వాడుకోవటం, ఈ అక్రమాల గురించి మామ నందులాల్, భార్య మహేశ్వరికి పూర్తి సమాచారం ఉన్నా… అడ్డు చెప్పకుండా విజయ్ కు సహకరించారని గుర్తించారు పోలీసులు. ఈ ఇద్దరిని సైతం కేసులో నిందితులుగా చేర్చారు. అయితే ఈ ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం.

పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు విజయ్ జాదవ్ వద్ద నుండి రైతుల డబ్బులను మాయం చేసేందుకు ఉపయోగించిన ల్యాప్‌టాప్, ఛార్జర్లు, మూడు సెల్ ఫోన్లు , ఆరు క్రెడిట్ కార్డులు, ఒక డైరీ, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే మేనేజర్ ను నమ్మి నిండా మునిగిన రైతులు మాత్రం అసలు ఈ డబ్బులు తిరిగొస్తాయో‌రావో అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి
75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి