Viral: సాక్షాత్తు లక్ష్మిదేవే వస్తుంది.. రోజూ ఆ దుకాణానికి గోమాత వచ్చి ఏం చేస్తుందంటే..?

ఒక కిరాణ షాపు యజమాని నిత్యం షాపు తెరవగానే పూజలు చేస్తున్నాడు. పూజ చేసిన కాసేపటికే అతని వద్దకు ప్రతి రోజు లక్ష్మి దేవి స్వరూపంగా భావించే గోమాత వస్తుంది. ఆ షాపు యజమాని ప్రేమగా పెట్టే పిండి పదార్థాలు, బెల్లం, పప్పులు తిని వెళ్తోంది. ఇలా రోజు జరుగుతున్న తంతును చూసి స్థానికులు అశ్చర్యపోతున్నారు.

Cow Into Shop
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Apr 02, 2024 | 1:02 PM

ఒక కిరాణ షాపు యజమాని నిత్యం షాపు తెరవగానే పూజలు చేస్తున్నాడు. పూజ చేసిన కాసేపటికే అతని వద్దకు ప్రతి రోజు లక్ష్మి దేవి స్వరూపంగా భావించే గోమాత వస్తుంది. ఆ షాపు యజమాని ప్రేమగా పెట్టే పిండి పదార్థాలు, బెల్లం, పప్పులు తిని వెళ్తోంది. ఇలా రోజు జరుగుతున్న తంతును చూసి స్థానికులు అశ్చర్యపోతున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని భాస్కర్ రావు అనే వ్యక్తి కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. యజమాని షాపులోకి ఒక ఆవు తన సొంత ఇంటిలోకి మనుషులు ఎలా వెళ్తారో..! అలానే ఆ గోమాత ఆ షాపులోకి వెళ్ళిపోతుంది. ఆ షాపు యజమాని గోమాత తినేందుకు ఏమైనా పెట్టేంత వరకు అక్కడి నుంచి కదలదు. ఎవ్వరైనా పంపించాలని చూసినా, ఆ గోవు అక్కడి నుంచి అడుగు కూడా బయటకు పెట్టదు.

హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాత ను లక్ష్మి దేవి గా కొలుస్తారు. ఎవరి ఇంటికైన ఆవు వచ్చిందంటే తమ ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందని, తమకు కలిసి వస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. కలిసి వచ్చినా.. రాకున్నా.. ఒక మూగ జీవికి ఆకలి తీర్చడం ఒక మంచి పనిగా భావిస్తారు. అదేవిధంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆ ఆవుకు బెల్లం, పిండి పదార్థాలు, పప్పులు పెడుతూ.. ఆ గోమాతకు చాలా దగ్గర అయ్యాడు ఆ షాపు యజమాని. తన షాపు గోమాత నిత్యం రావడంతో తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని, ప్రతి రోజూ బెల్లం తినిపిస్తానని, అప్పుడప్పుడు కూరగాయలు,టమాటాలు పెట్టి గోమాత ఆకలి తీర్చుతాను అని చెప్పుకొచ్చారు. ఆ…ఆవు కూడా ఎంతో ఆప్యాయతను షాపు యజమానిపై చూపుతుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే

ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!

విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు

ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్