అరుదైన వ్యాధితో జన్మించిన చిన్నారులు.. తుమ్మినా, కదిలినా విరిగే ఎముకలు.. తల్లడిల్లుతోన్న తల్లి
పుట్టిన పిల్లల ఎముకలు గుడ్డు పెంకులా అత్యంత సున్నితంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆ కన్న తల్లి దుఃఖం వర్ణనాతీతం. ఎంత సున్నితమైన ఎముకలంటే పిల్లలు తుమ్మినా, కనీసం ఎత్తుకుని తిప్పినా సరే వారి ఎముకలు విరిగిపోయేటంత బలహీనంగా ఉన్నాయి. పిల్లల్ని కౌగిలించుకోవడం లేదా తల్లి ఒడిలో పెట్టుకోవడం కూడా నొప్పితో విలవిలాడతారు. మిర్రర్ నివేదిక ప్రకారం జార్జియాకు చెందిన 27 ఏళ్ల ర్యాన్ సర్హల్ సెప్టెంబర్ 2020లో కవల బాలికలకు (మరియమ్, మియాలు) జన్మనిచ్చింది. పుట్టిన శిశువుల శరీరంపై డజన్ల కొద్దీ పగుళ్లు ఉన్నాయి.
సృష్టిలో తియ్యనిది మాతృత్వం.. అమ్మదనంలోని కమ్మదనం అనుభవించడానికి తల్లి కావడానికి ప్రతి స్త్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అదే విధంగా ఓ మహిళ పిల్లల కోసం ఎదురు చుసిబంది. ఆమె కలలు నిజమై కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది కూడా. అయితే పుట్టిన పిల్లల ఎముకలు గుడ్డు పెంకులా అత్యంత సున్నితంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆ కన్న తల్లి దుఃఖం వర్ణనాతీతం. ఎంత సున్నితమైన ఎముకలంటే పిల్లలు తుమ్మినా, కనీసం ఎత్తుకుని తిప్పినా సరే వారి ఎముకలు విరిగిపోయేటంత బలహీనంగా ఉన్నాయి. పిల్లల్ని కౌగిలించుకోవడం లేదా తల్లి ఒడిలో పెట్టుకోవడం కూడా నొప్పితో విలవిలాడతారు.
మిర్రర్ నివేదిక ప్రకారం జార్జియాకు చెందిన 27 ఏళ్ల ర్యాన్ సర్హల్ సెప్టెంబర్ 2020లో కవల బాలికలకు (మరియమ్, మియాలు) జన్మనిచ్చింది. పుట్టిన శిశువుల శరీరంపై డజన్ల కొద్దీ పగుళ్లు ఉన్నాయి. ఆ పిల్లల్ని ఎవరూ ఎత్తుకుని తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో చిన్నారులకు రక్త పరీక్ష చేయగా.. ఆస్టియోజెనిసిస్ ఇంపర్‌ఫెక్టా అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. దీని కారణంగా ఎముకలు చాలా పెళుసుగా మారి.. చాలా సులభంగా పగుళ్లు వస్తాయి. ఈజీగా విరిగిపోతాయి.
బాలికల పరిస్థితి చాలా విషమంగా ఉన్నందున రక్షించడం కష్టమని వైద్యులు ర్యాన్‌కు చెప్పారు. అయితే తల్లి నిరాశ చెందలేదు.. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉంచి చిన్నారులకు చికిత్సనందించింది . అప్పుడు కొంచెం పరిస్థితి మెరుగుపడింది. అయితే ర్యాన్ ఇప్పటికీ తన కవల పిల్లలని తన ఒడిలో పెట్టుకుని మాతృ ప్రేమని అనుభవించలేకపోతుంది. ఎందుకంటే ఒడిలో పెట్టుకున్న సమయంలో తన కుమార్తెల లెక్కలేనన్ని ఎముకలు విరిగిపోయాయని తల్లి ర్యాన్ చెప్పింది.
అయితే ర్యాన్ ఆశ వదులుకోలేదు. చిన్నారులకు చికిత్స ఇప్పిస్తూనే ఉంది. ప్రస్తుతం తన పిల్లల పరిస్థితి చాలా మెరుగుపడిందని తెలిపింది. వ్యాధి టైప్ 3కి తగ్గింది. ఇది వ్యాధి తీవ్రతను తక్కువ చేస్తోంది. ఇప్పుడు తల్లి తన పిల్లల్ని ఒడిలో కూడా పెట్టుకుంటుంది.
అయితే బాలికలు పూర్తిగా ఈ వ్యాధి నుంచి కోలుకోలేరని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య వారి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
గర్భం దాల్చిన 20వ వారంలో పిల్లల కాళ్లు, చేతులు వంగినట్లు వైద్యులు గుర్తించారు. శిశువుల ఆరోగ్య విషయంలో ఏదో లోటు ఉందని అనుమానించారు. అయితే అది పెద్ద విషయం కాదు అనుకున్నామని చెప్పారు. మరియమ్, మియాలు పుట్టాక.. వారి పరిస్థితి చూసి డాక్టర్లు కూడా చలించిపోయారు. ఎందుకంటే వారు చాలా ఫ్రాక్చర్లతో పుట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..