Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే ప్రత్యర్ధుల ఫోన్లు టాప్ చేశామని ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు వాంగ్మూలం ఇస్తున్నారు. వీటితోపాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రకంపనలు.. తెరపైకి వస్తున్న అసలు సూత్రధారులు
Phone Tapping Case Filed
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 02, 2024 | 1:48 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గత ప్రభుత్వ పెద్దలను కుదిపేస్తుంది. ఇప్పటివరకు కేవలం పోలీసులపై ఫోకస్ చేసిన స్పెషల్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల వెంట పడబోతుంది. నేతలు చెబితేనే ప్రత్యర్ధుల ఫోన్లు టాప్ చేశామని ఇప్పటికే అరెస్ట్ అయిన అధికారులు వాంగ్మూలం ఇస్తున్నారు. వీటితోపాటు ప్రత్యక్షంగా పలువురు నేతలు తమ ఫోన్లను టాప్ చేశారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ఈ ట్యాపింగ్ భూతంలో చిక్కుకునేది ఎవరు? వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు నలుగురు పోలీస్ ఉన్నతాధికారులను అరెస్టు చేశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. త్వరలోనే వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో రాజకీయ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే నేతల వివరాలను రాబట్టిన పోలీసులు అధికారిక నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అరెస్ట్ అయిన అధికారుల రిమాండ్ రిపోర్ట్ బహిర్గతం కావడంతో తమ ఫోన్లు టాప్ అయ్యాయి అంటూ పలువురు నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు, రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ-4 నిందితుడిగా ఉన్నాడు మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడించాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అండ్ కో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేసినట్టు రాధా కిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే దుబ్బాక అప్పటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రణీత్ రావు అండ్ కో తన ఫోను టాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు.

అప్పట్లో ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేట్ వద్ద రఘునందన్ రావుకి సంబంధించిన కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. సిద్దిపేటకు సంబంధించిన చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నారు రఘునందన్ రావు బంధువులు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి సంభాషణలు విన్న ప్రణీత్ రావ్ అండ్ కో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో రఘునందన్ రావుకు చెందిన కోటి రూపాయలు సీజ్ చేశారు. అయితే ఈ ఘటనపై తాజాగా హరీష్ రావుతో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. తన ఫోన్లు టాప్ చేసిన రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర డిజిపిని కలిసి విన్నవించుకున్నారు.

ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీ మంత్రి కేటీఆర్‌కు సైతం చుట్టుకుంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశార. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటైన వార్ రూమ్‌ను కేటీఆర్ నడిపించారంటూ మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సెంట్రిక్‌గానే మొత్తం ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

ఇక ఈ ఫిర్యాదులపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ నేతలకు ట్వీట్‌తో కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్. తనపై ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను లీగల్‌గా ఎదుర్కొంటానని ట్వీట్‌ చేశారు. కె.కె. మహేందర్‌, యెన్నం శ్రీనివాస్ రెడ్డితో పాటు, మంత్రికి లీగల్‌ నోటీసులు ఇస్తానని కేటీఆర్‌ చెప్పారు. నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాలని కేటీఆర్‌ హెచ్చరించారు.

ఇక తాజాగా రాష్ట్ర డిజిపి ని కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత సమ్మిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారని అందులో తనిఖీలు జరిపించాలని రాష్ట్ర డిజిపిని కలిసి వినతి పత్రం అందించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్లను టాప్ చేశారని ఆరోపిస్తూ డిజిపి రవి గుప్తాకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

ఇలా ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుండగానే నేతలు గత ప్రభుత్వ పెద్దలపై ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. వ్యాపారులు, ప్రతిపక్ష నాయకులు వారి కుటుంబ సభ్యులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వ పోలీస్ అధికారులు టాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీస్ అధికారుల పాత్ర పై క్లారిటీకి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల భరతం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నాయకులపై పలుచోట్ల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు, మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు లు తమ ఫోన్లను టాప్ చేశారంటూ బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ అధికారుల పాత్రను లోతుగా దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం వారు ఇచ్చే సమాచారం ఆధారంగా రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!