అయ్యప్ప ఆలయ గేటుకు తాళాలు..భగ్గుమన్న గ్రామస్తులు

ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ దేవాలయం ప్రభుత్వం స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు గుడికి తాళం వేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డేక్కారు. గుడిని కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయాన్ని 25 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా మండల రెవెన్యూ అధికారులు ఈ గుడి ప్రభుత్వ […]

అయ్యప్ప ఆలయ గేటుకు తాళాలు..భగ్గుమన్న గ్రామస్తులు
Follow us

|

Updated on: Sep 06, 2019 | 3:13 PM

ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ దేవాలయం ప్రభుత్వం స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు గుడికి తాళం వేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డేక్కారు. గుడిని కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయాన్ని 25 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా మండల రెవెన్యూ అధికారులు ఈ గుడి ప్రభుత్వ స్థలంలో ఉందని గుడి గేట్లకు తాళాలు వేశారు. ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా పెట్టారు. గుడికి వెళ్లిన అయ్యప్ప భక్తులకు గేటుకు వేసిన తాళాలు దర్శనమివ్వటంతో..నివ్వేరపోయారు. గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 69లో 40 సెంట్ల భూమిని కాగితాల రమణమ్మ అనే మహిళ అయ్యప్ప దేవాలయం నిర్మాణం కొరకు గ్రామానికి ఇవ్వగా మిగతా 40 సెంట్ల భూమి అప్పటి తహసీల్దార్‌గా ఉన్న నాగేశ్వర్‌ రావు ఆలయ నిర్మాణం కొరకు గుడికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో గుడి నిర్మించారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌతమ్‌ అనే ఐఏఎస్‌ అధికారి భూ ప్రక్షాళనలో భాగంగా వెంటాపురం మండల తహసీల్దార్‌ రాముకు ఈ భూమంతా ప్రభుత్వ భూమి అని వెంటనే దిమ్మలు ఏర్పాటు చేసి గుడి గేట్లకు తాళాలు వేయాలని ఆదేశించారు. అతిక్రమిస్తే.. శిక్షార్హులు అవుతారని హెచ్చరిక బోర్డులు పెట్టించారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డేక్కి నిరసన చేపట్టారు. గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.