5

Telangana Yadavs: రేవంత్ రెడ్డి 24 గంటల్లో యాదవులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే..

రేవంత్‌రెడ్డి 24 గంటల్లోగా యాదవులకు క్షమాపణలు చెప్పాలని గొల్లకురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్‌ చేశారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు..

Telangana Yadavs: రేవంత్ రెడ్డి 24 గంటల్లో యాదవులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే..
Revanth Reddy
Follow us

|

Updated on: May 11, 2023 | 6:12 PM

రేవంత్‌రెడ్డి 24 గంటల్లోగా యాదవులకు క్షమాపణలు చెప్పాలని గొల్లకురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్‌ చేశారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. యాదవులను, వృత్తిని అవమానించారని, రేవంత్ రెడ్డికి రాజనీతి శాస్త్రం తెలియని ఒక రౌడీ రాజకీయ నాయకుడని, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు స్థాయిలో ఉన్న ఆయన.. ఈ రాష్ట్రంలో ఓ యాదవ మంత్రిని ఆర్థిక,కుల అహంకారంతో దూషించడంపై ఆయన మండిపడ్డారు. యాదవులు శ్రీకృష్ణుని వారసులు, పశుపాలకులు, పరిపాలకులు కూడా అని అన్నారు. తాము ప్రపంచానికి అన్నం పెట్టె యాదవులమని, పాలు,పెరుగు, వెన్న,నెయ్యి, మాంసం ఉత్పత్తి చేసే వృత్తి అని, ఈ సమాజానికి పౌష్టిక ఆహారాన్ని అందించే ఉత్పత్తిదారులమన్నారు.

రాజకీయ చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి ఆర్థిక, కుల అహంకారంతో ఒక యాదవ్ మంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి యాదవ సమాజాన్ని అవమానించారని ఆయన విమర్శించారు. యాదవ వృత్తిని అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బేషరతుగా యాదవలకు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో గొల్లకురుమ(యాదవ )హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దున్నపోతులతో గొర్రె పొట్టేళ్లతో గాంధీభవన్ ముట్టడిస్తామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి