TS DOST 2023: తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ/ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి పలు కోర్సులో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ 2023 విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ నోటిఫికేషన్‌ విడుదల..

TS DOST 2023: తెలంగాణ డిగ్రీ ప్రవేశాలకు దోస్త్-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఈసారి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే
TS DOST 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2023 | 9:33 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ/ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి పలు కోర్సులో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ 2023 విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. మొదటి ఫేస్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం దోస్ట్‌ వెబ్‌సైట్‌లో మే 16 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రోఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. డిగ్రీ ప్రవేశాల అడ్మిషన్ల దోస్త్ ప్రక్రియ దేశానికే ఆదర్శం. ఈ ఏడాది దోస్త్ యాప్ తీసుకొస్తున్నాం. మీ సేవ, T App తో పాటు దోస్త్ యాప్‌తో విద్యార్లులు నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు సకాలంలో అడ్మిషన్తు తీసుకోవాలి. రాష్ట్రంలో మొత్తం 1054 డిగ్రీ కాలేజీల్లో 3, 86, 544 సీట్లు దోస్త్ కింద అందుబాటులో ఉన్నాయి.136 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయన్నారు. అనంతరం

కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. చాలా రాష్ట్రాలు డిగ్రీ ప్రవేశాల కోసం మన దోస్త్ ప్రక్రియ పరిశీలించాయి. దోస్త్‌ దేశానికే ఆదర్శం. దోస్త్ పేజ్-1 ప్రక్రియ అయిపోయే లోపు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ మిస్ అయిన విద్యార్థులు ఫేజ్-2 లో డిగ్రీ ప్రవేశాల ఛాన్స్ వాళ్ళకి ఉంటుంది. ఈ ఏడాది స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులు, Bsc జాబ్ హానర్ కోర్సులు ప్రవేశం పెడుతున్నాం.11 ప్రభుత్వ కాలేజీలు, మరికొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదీ షెడ్యూల్‌..

  • దోస్త్‌ ఫేజ్ 1 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: మే 16 నుంచి జూన్ 10 వరకు
  • ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్: మే 20 నుంచి జూన్ 11 వరకు
  • ఫేజ్ 1 సీట్ల కేటాయింపు: జూన్ 16
  • దోస్త్‌ ఫేజ్ -2 రిజిస్ట్రేషన్: జూన్ 16 నుంచి జూన్ 26 వరకు
  • ఫేజ్ -2 వెబ్ ఆప్షన్స్: జూన్ 16 నుంచి 27 వరకు
  • ఫేజ్ -2 సీట్ల కేటాయింపు: జూన్ 30
  • దోస్త్‌ ఫేజ్-3 రిజస్ట్రేషన్‌: జూలై 1 నుంచి జూలై 5 వరకు
  • ఫేజ్-3 వెబ్ ఆప్షన్స్: జూలై 1 నుంచి 6 వరకు
  • ఫేజ్ -3 సీట్ల కేటాయింపు: జూలై 10
  • డిగ్రీ రెగ్యులర్ తరగతులు ప్రారంభం: జూలై 17 నుంచి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.