AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR Enumeration Online: ఓటర్ ఐడీ ఉన్నవారికి రిలీఫ్.. ఆన్‌లైన్‌లోనూ SIR ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.. ఒకే ఒక్క క్లిక్‌తో

తెలంగాణలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ మొదలైంది. దీంతో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి సర్వే ప్రక్రియ చేపడుతున్నారు. అయితే ఆప్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూాడా ఎమ్యూనరేషన్ ఫారం నుంచి ఈ ప్రక్రియ చేపట్టవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

SIR Enumeration Online: ఓటర్ ఐడీ ఉన్నవారికి రిలీఫ్.. ఆన్‌లైన్‌లోనూ SIR ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.. ఒకే ఒక్క క్లిక్‌తో
Sir Online
Venkatrao Lella
|

Updated on: Jun 26, 2026 | 11:45 AM

Share

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) సర్వే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. జులై 24వ తేదీ వరకు దీనిని నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియల భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తున్నారు. ఓటర్లు వీటికి పూర్తి చేసిన తర్వాత బీఎల్‌వోలకు అందించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారంలు అందించిన రెండు, మూడు రోజుల తర్వాత బీఎల్‌వోలు మళ్లీ ఇంటింటికి వెళ్లి ఈ ఫారాలను స్వీకరిస్తారు. తెలుగులో కూడా ఈ పత్రాలు ఉంటాయి. దీంతో నిర్లక్ష్యరాస్యులు కూడా సులువుగా అర్థం చేసుకుని ఫారం నింపవచ్చు. ప్రతీ రోజు 50 ఇళ్లకు వెళ్లి బీఎల్‌వోలు ఈ దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. గుడవు తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్‌వోలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు చూస్తున్నారు. ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జులై 24 వరకు గడువు

తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికి బీఎల్‌వోలు అందించాలి. అనతరం ఓటర్లు వాటిని పూర్తి చేసి తిరిగి అందించాలి. బీఎల్‌వోలు తీసుకోకపోతే ఈసీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. జులై 24వ తేదీలోపు వీటిని ఓటర్లందరూ అందించాల్సి ఉంటుంది. అయితే ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఎన్యూమరేషన్ ఫారం నింపవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక ఆన్‌లైన్ సౌకర్యం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎమ్యూనరేషన్ పత్రాలను ఈసీ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యి సులువుగా ఫారం నింపవచ్చు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్.. ఈ రెండిటిల్లో ఏ విధానం ద్వారా అయినా సమర్పించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

ఆన్‌లైన్‌లో నింపడం ఎలా..?

-voters.eci.gov.in వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

-ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

-ఓటర్ పేరు, , EPIC నంబర్, ఇతర వివరాలను చెక్ చేసుకోవాలి

-అనంతరం ఓటర్ ఫారంలో వివరాలు నమోదు చేయాలి

-నమోదు చేసిన ఫారంను మళ్లీ చెక్ చేసుకోవాలి

-ఈ-సంతకం పూర్తి చేయాలి

-ఓటీపీ ఎంటర్ చేసి సమర్పించాలి

-రసీదును సేవ్ చేసుకుని బీఎల్‌ఓకు అందించాలి

Follow Us