AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.1.37 లక్షల జీతం.. విద్యాశాఖలో DEO ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్ విడుదల

TGPSC DEO Recruitment 2026: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలకు జూలై 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1,37,050 వరకు వేతనం లభించనుంది. ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

నెలకు రూ.1.37 లక్షల జీతం.. విద్యాశాఖలో DEO ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్ విడుదల
TGPSC DEO Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 26, 2026 | 8:45 AM

Share

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు చెప్పింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 డీఈవో పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో మల్టీ జోన్ 1లో 10 పోస్టులు, మల్టీ జోన్ 2లో 14 వరకు పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 19, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతాయి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీ అభ్యర్థులు: రూ.1,000 (ప్రాసెసింగ్ ఫీజు), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు: రూ.500 (ప్రాసెసింగ్ ఫీజు) చొప్పున చెల్లించాలి. దీనితోపాటు అందరూ అదనంగా పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు జీతంగా చెల్లిస్తారు.

పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగాల నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇక పేపర్ 2లో బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాల నుంచి 300 మార్కులకు 300 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. విద్యారంగంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది మంచి అవకాశం.

ముఖ్యమైన తేదీలు ఇవే

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల చివరి తేదీ: జూలై 19, 2026 సాయంత్రం 5 గంటల వరకు
  • రాత పరీక్షలు: అక్టోబర్ 2026లో
  • హాల్‌టికెట్లు విడుదల: పరీక్ష తేదీకి 7 రోజుల ముందు

తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us