AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్నదాతల పాలిట మృత్యువుగా మారిన విద్యుత్ తీగలు.. ఇద్దరు రైతులు మృతి

అడవి పందులు, కోతుల బారి నుంచి తమ పంటను కాపాడుకోవాలని అన్నదాతలు చేసిన ప్రయత్నం వారి పాలిట మృత్యువు దేవతగా మారింది. తమ పంటలను కాపాడుకోవడానికి పంట చుట్టూ విద్యుత్‌ తీగలతో కంచె ఏర్పాటు చేస్తుండగా అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాత పడ్డారు.ఈ విషాద ఘటన తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Telangana: అన్నదాతల పాలిట మృత్యువుగా మారిన విద్యుత్ తీగలు.. ఇద్దరు రైతులు మృతి
Telangana
P Shivteja
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 4:04 PM

Share

పంట రక్షణకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు యమ పాశం అయ్యాయి. ఇద్దరు రైతులు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప తీగ వేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు అన్నదమ్ములకు చెందారు. గోవింద్ పూర్ కు చెందిన ఎరుకల జగన్ (48), ఎరుకల మల్లేశం(44) వ్యవసాయంతోపాటు తాపీ మేస్త్రీలుగా పని చేస్తూ జీవిస్తున్నారు. పొలంలో చెరకు, ఇతర పంటలను అడవి పందులు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు గురువారం రాత్రి ఇద్దరూ పొలానికి వెళ్లి చుట్టూ ఇనుప తీగ ఏర్పాటు చేశారు. పొలం మీదుగా వెళు తున్న 32/11 కేవీ విద్యుత్తు తీగల నుంచి ఇనుప కంచెకు కనెక్షన్ ఇచ్చేందుకు యత్నిస్తుండగా ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. జగన్, మల్లేశం పొలంలోనే ప్రాణాలు విడిచారు. అటుగా వెళ్లిన రైతులు ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!