AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆరోజు నుంచే

కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల, కొత్త రేషన్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆరోజు నుంచే
Telangana New Pensions
Anand T
|

Updated on: May 18, 2026 | 9:26 AM

Share

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి వివేక్ సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులను తెలంగాలణ అవతరణ దినోత్సవమైన జూన్ 2వ లేదీని నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన సుమారు 2లక్షల మందికి కొత్త పెన్షన్లు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిదని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించినట్టు తెలిపారు.

అలాగే పెన్షన్ల జారీ విషయంలో గత ప్రభుత్వ తీరుపై కూడా ఆయన మండి పడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సంక్షేమ రంగానికి పూర్వవైభవం వచ్చిందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెంచన్లు అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.

జూన్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

అలాగే పేదల సొంతింట కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తైందని.. కొన్ని ప్రాంతాల్లో గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్టు ఆయన తెలిపారు. రాబోయే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కూడా ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నెలాఖరులోపూ పూర్తి ధాన్యం కొనుగోలు

మరోవైపు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. రైతులు పండించిన దాన్యాన్ని ప్రభుత్వం వేగంగా కొనుగోలు చేస్తుందని, అలాగే నిధులు కూడా సకాలంలో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా ఐకేపీ కేంద్రాల్లోని పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్