Telangana: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు..
ప్రముఖ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. 2022లో ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దేశ ద్రోహం కేసు చేశారు.

ప్రముఖ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. 2022లో ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దేశ ద్రోహం కేసు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పది సెక్షన్ల కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కేసు బుక్ చేశారు పోలీసులు.
అయితే, పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా హరగోపాల్‌పై నమోదైన కేసు వివరాలను బయటపెట్టారు పోలీసులు. కాగా, ప్రొఫెసర్ హరగోపాల్‌పై UAPA కింద కేసు పెట్టడంపై ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు. హరగోపాల్ పై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పోలీస్ రాజ్యం తీసుకువస్తున్నారని విమర్శించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
