AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఒక్క అలవాటు అతడిని లోకాన్ని వీడేలా చేసింది.. బీ కేర్‌ఫుల్

ఆన్‌లైన్‌ గేమింగ్‌ మాయలో పడితే అంతా హాంఫట్‌. డబ్బుల ఆశ చూపి ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. ఇప్పుడు చాలా మంది గేమింగ్‌ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మోసపోయామని తెలిసే లోపే పూర్తిగా నష్టపోతున్నారు బాధితులు. లక్షల్లో నష్టపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో అలాంటి విషాద ఘటనే వెలుగుచూసింది.

Telangana: ఆ ఒక్క అలవాటు అతడిని లోకాన్ని వీడేలా చేసింది.. బీ కేర్‌ఫుల్
Prudhvi
Ram Naramaneni
|

Updated on: May 07, 2024 | 8:55 AM

Share

ఆన్‌లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. లక్ కలిసి వస్తోందన్న భ్రమలో.. ఒక్కసారిగా డబ్బు వచ్చి పడాలన్న ఆశతో వాటికి బానిసలై ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. ఆపై.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సరదాగా మొదలైన బెట్టింగ్ ఆట వ్యసనంగా మారి యువత జీవితాలను నాశనం చేస్తోంది.  పదులు, వందలు, వేల నుంచి లక్షలకు చేరింది ఆన్‌లైన్ జూదం. ఫలితం.. అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు యువకులు. తాజాగా కరీంనగర్‌ జిల్లా గంగాధరలో ఆన్‌లైన్‌ గేములతో డబ్బులు కోల్పోయి ఓ యువ సాఫ్ట్‌వేరు ఇంజినీరు సూసైడ్ చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్‌, లక్ష్మిల కుమారుడు పృథ్వీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి.. సంవత్సరం క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేరు ఇంజినీరుగా ఉద్యోగంలో చేశాడు. యూపీలోని నోయిడాకు వెళ్లాలని కంపెనీ వాళ్లు చెప్పడంతో.. 2 నెలల కిందట అక్కడకు వెళ్లాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ రూమ్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతన్ని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లోకి దింపారు. ఇందు కోసం పృథ్వీ రకరకాల రీజన్స్ చెప్పి ఫ్రెండ్స్, బంధువులు, తెలిసినవారి వద్ద రూ.12 లక్షలు అప్పు చేశాడు. కానీ నాలుగు రోజుల్లోనే సొమ్ము అంతా పోయింది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.  15 రోజులుగా జాబ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పులు ఎలా చెల్లించాలో నిత్యం మదనపడసాగాడు.  తీవ్ర ఆందోళనకు గురై శనివారం రాత్రి రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు.

అసలు ఆన్‌లైన్ గేమ్స్‌లో ఎవరైనా డబ్బు సంపాదించారా? ఔననే సమాధానం ఏ ఒక్కరి నుంచి రాదు. ఇది నిజం. ఊరించే ఆఫర్లకు, కన్నింగ్ ప్రకటనలకు మోసపోవద్దు. జేబులో ఉన్న డబ్బులు, ఖాతాల్లోని నగదును ఊడ్చేయొద్దు. సో.. స్నేహితులతో ఆడుకోండి. పిల్లలను ఆడించండి. మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి ఆటలవుతాయి గానీ.. ప్రాణాలు తీసే ఆన్‌లైన్‌ గేమ్స్‌ జోలికి వెళ్లడం కరెక్ట్‌ కాదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..