AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS 10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్‌.. అలాగే హాల్ టికెట్స్ ..

ఈ ఏడాది నుంచి ఆరుపేపర్లతో, వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుంది కానీ... సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండదు

TS 10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన ఛాయిస్‌.. అలాగే హాల్ టికెట్స్ ..
Telangana SSC Exmas
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2023 | 6:15 PM

Share

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుంది. శుక్రవారం నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది విద్యాశాఖ. వచ్చే నెల 3వ తేది నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. టెన్త్ ఎగ్జామ్స్ రాసేందుకు 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు.

కాగా ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్‌ పేపర్స్‌లోని వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్‌ పెంచారు. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ  జ‌న‌వ‌రి 11నే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబ‌రు 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప క్వచ్చన్స్ సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్‌ ఛాయిస్‌ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో A లేదా B అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనిపై టీచర్స్‌తో పాటు పేరెంట్స్‌ నుంచి కాస్త వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే స్టూడెంట్స్ హాజరయ్యారు. దీంతో లెర్నింగ్ కెపాసిటీ తగ్గింది. దీంతో ఎగ్జామ్ పాట్రన్‌లో మార్పులు చేయాలని..ఛాయిస్‌ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్‌ ఛాయిస్‌ను రిమూవ్ చేసింది. 6 ప్రశ్నల్లో నాలుగింటికి ఆన్సర్స్ రాయాలని పేర్కొంది.

దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల అలాట్‌మెంట్ మారింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మ్యాథ్స్, సైన్స్‌, సోషల్‌లకు…అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తించనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.