Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒక్క పూట బడులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఈక్రమంలో హాఫ్ డే స్కూల్స్, సమ్మర్ హాలిడేస్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, మార్చి 15 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కపూట బడులుగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఒక్క పూట బడులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వలు ఇచ్చింది. . 2025 మార్చి 15వ తేదీనుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలు ఉంటాయని వెల్లడించింది. 12:30 మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపింది. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు.
BREAKING: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు #Telangana pic.twitter.com/lDKn90fmEv
— Janardhan Veluru (@JanaVeluru) March 13, 2025
కాగా సెలవుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.