Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న వైరస్ ఉధృతి.. నిన్న ఒక్కరోజే 56 మంది మృతి.. అత్యధిక కేసులు ఎక్కడంటే..?
తెలంగాణలో కరోనా వైరస్ వికృతరూపం కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోల్చితే తక్కువ కేసులు నమోదు కావటం ఊరటనిస్తోంది. కాగా, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
Telangana Coronavirus positive Cases:తెలంగాణలో కరోనా వైరస్ వికృతరూపం కొనసాగుతోంది. అయితే, నిన్నటితో పోల్చితే తక్కువ కేసులు నమోదు కావటం ఊరటనిస్తోంది. కాగా, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు.. నేడు 8 వేలకు పైగా నమోదు అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 8,061 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. కాగా, మంగళవారం ఒక్కరోజే మరో 56 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బలెటిన్‌లో పేర్కొంది.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా మరో 5,093 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 72,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ర్ట వ్యాప్తంగా 82,270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,508 కేసులు ఉన్నాయి. ఇక, తర్వాతి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డి జిల్లాలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మహబూబ్‌నగర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…..