Telangana: అమ్మ బాబాయ్ పాములే పాములు.. వర్షాలకు బయటకు వస్తున్న పాములు.. భయం… భయంగా రైతులు..
ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి... వాతవరణంలో మార్పులు వచ్చాయి.. చల్లటి వాతవరణంలో.. పాములు బయటకు వస్తున్నాయి.. దీంతో.. ఎటు చూసిన పాములు కనబడుతున్నాయి. అదుపు తప్పి.. పాము పై కాలు వేస్తే.. కాటు వేస్తున్నాయి... ఈ వారం రోజుల్లో పాము కరిచిన బాధితుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇటు. పొలాల్లో.. అటు గ్రామాల్లో.. పాములు వస్తున్నాయి. వివిధ రకాల పాముల సంచారంతో జనం భయం తో వణికిపోతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతవరణం ఒక్కసారి చల్లబడింది. అయితే సహజంగానే.. ఈ సమయంలో పాములు బయటకు వస్తాయి. ఇన్ని రోజులు వేడి కారణంగా.. బయటకు రాకుండా.. పుట్టలు… ఇతర బండల కింద.. ఉండిపోయాయి… వర్షం కురిసిన తరువాత.. భూమి చల్లబడిపోతుంది.. దీంతో ఈ చల్ల గాలికి ఒక్కేసారీ పాములన్నీ బయటకు వస్తున్నాయి. అంతేకాదు కప్పలు. ఇతర క్రిమి కిటకాలు కూడా ఈ వాతవరణంలో సంచరించడంతో.. వాటిని తినడానికి పాములు వస్తున్నాయి.. రైతులు కూడా పనుల్లో బిజి.. బిజిగా ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు… పొలాల్లో గడుపుతున్నారు రైతులు.
అయితే చూడకుండా… వాటిపై కాలు వేయడంతో.. కాలు వేస్తున్నాయి. ఈ సీజన్లో పాము కాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. పాములు పట్టే వారి సంఖ్య కూడా తక్కువే.. పామును చూసిన తరువాత.. మళ్లీ.. ఆ ప్రాంతానికి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. కానీ.. పాము ఒకే ప్రాంతంలో ఉండకుండా… వివిధ ప్రాంతాల్లో తిరుగుతు ఉంటుంది. అక్కడక్కడ పాములు పట్టే వ్యక్తులు ఉన్నారు.. వారికి.. ఈ సీజన్లో రోజు పది వరకు ఫోన్లు వస్తున్నాయి. కానీ.. ఒక్కటి, రెండు కంటే.. ఎక్కువ పట్టడం లేదు. మిగతా పాములను అలానే వదిలిపెడుతున్నారు.
కేవలం వ్యవసాయ పొలాల్లోనే కాదు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాయి. ఎక్కువగా చల్లగా ఉన్న ప్రాంతంలో తిష్ట వేస్తున్నాయి. అతి వి షపూరితమైన పాములు కూడా తిరుగుతున్నాయి. దీంతో పాముల భయానికి వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు. చేతిలో కర్ర పట్టుకొని పొలం దగ్గరికి వెళ్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడంతో.. పిల్లలు భయపడుతున్నారు. గతంలో కూడా పిల్లలను పాములు కరిచిన సంఘటలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ సీజన్లో భయపడుతున్నారు. మొత్తానికి పాముల సంచారంతో రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు పాములు అధికంగా సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వ్యవసాయ పొలాలతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాయని చెబుతున్నారు. పాములు కాటు వేస్తున్నాయని భయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..