AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Purana: గరుడ పురాణం పీరియడ్స్ గురించి ఏమి చెప్పింది? ఈ సమయంలో స్త్రీలు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే…

గరుడ పురాణం మత విశ్వాసాల గురించి మాత్రమే కాకుండా సమతుల్య శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి కూడా ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం పీరియడ్స్ గురించి చాలా లోతైన విషయం చెబుతుంది. ఋతుచక్రం సహజమైన, అవసరమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఈ సమయంలో మహిళలకు శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. అందుకనే ఈ సమయంలో మహిళలు పూజలు, మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మహిళలు గుర్తుంచుకోవలసిన విషయాలను తెలుసుకుందాం..

Garuda Purana: గరుడ పురాణం పీరియడ్స్ గురించి ఏమి చెప్పింది? ఈ సమయంలో స్త్రీలు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే...
Garuda Puran
Surya Kala
|

Updated on: May 24, 2025 | 8:09 AM

Share

గరుడ పురాణం హిందూ మతంలో ప్రధాన గ్రంథం. దీనిలో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలను గురించి చర్చించడమే కాదు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. ఈ గ్రంథం జీవితంలోని ప్రతి అంశంపై దృష్టి పెట్టింది. ఒక వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మహిళల శారీరక , మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే అనేక విషయాలను ఈ పురాణంలో చెప్పబడింది. ఈ విషయంపై జ్యోతిష్కులు మరింత సంచారాన్ని చెప్పారు..

గరుడ పురాణం ప్రకారం ఋతుస్రావం అనేది సహజమైన, అవసరమైన శారీరక ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఇది మహిళల జీవిత చక్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో స్త్రీకి శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. గరుడ పురాణం ప్రకారం మహిళలు తమ శారీరక అలసట, మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని తిరిగి శక్తివంతం చేసుకునే సమయం ఇది. కనుక స్త్రీలు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయంగా పరిగణించబడుతుంది.

పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువ పని చేయకూడదు అని గరుడ పురాణం కూడా పేర్కొంది. దీనికి కారణం ఋతుస్రావం సమయంలో మహిళల శరీరం, మనస్సు రెండింటిపై అదనపు ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ సమయంలో పూజలు, మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి స్వచ్ఛతను కాపాడుకోవాలని సూచించారు. స్వచ్ఛతతో పాటు, మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. తద్వారా ఎలాంటి మానసికంగా ఒత్తిడి ఉండదు. శరీర శక్తి సరైన దిశలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అందుకనే సనాతన ధర్మంలో ఈ ఈ కాలంలో స్త్రీలు ఇంటి పనులకు దూరంగా ఉండాలని సూచించింది. అంటే ఈ సమయంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా తమను తాము సరిగ్గా తిరిగి స్థిరపరచుకోవడానికి, కుటుంబం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని గరుడ పురాణం కూడా పేర్కొంది. అయితే ఈ సలహా సామాజికంగా ఒంటరిగా గడపడం కోసం కాదు.. స్త్రీకి కావలసిన సరైన విశ్రాంతి, శాంతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవ్వబడింది.

ఈ సమయంలో మహిళలు పూజలు చేసి ఉపవాసం ఉంటే.. అది వారి శారీరక, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కూడా ఈ గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఋతుస్రావాన్ని ఒక బాధ్యతగా లేదా లోపంగా చూడకూడదు. అంతేకాదు ఋతు చక్రాన్ని స్త్రీలు గౌరవంగా.. సుఖంగా ఉండే సహజ ప్రక్రియగా భావించాలని వెల్లడించింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు