Khammam Trs: ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో గ్రూపుల గోల.. పిలవకుండా ఎలా వస్తానంటూ తుమ్మల ఆవేదన..

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో మరోసారి గ్రూపుల పోరు బయటపడింది. ఎంపీల సన్మాన సభ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకొచ్చాయి.

Khammam Trs: ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో గ్రూపుల గోల.. పిలవకుండా ఎలా వస్తానంటూ తుమ్మల ఆవేదన..
Trs Party
Follow us

|

Updated on: Nov 19, 2022 | 1:18 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో మరోసారి గ్రూపుల పోరు బయటపడింది. ఎంపీల సన్మాన సభ వేదికగా నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకొచ్చాయి. నిన్న సత్తుపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టి కొత్తగా రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన పార్ధసారధిరెడ్డి, గాయత్రి రవిలను సన్మానించారు టీఆర్‌ఎస్‌ నేతలు. అయితే, ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటికి పార్టీ తరఫున ఆహ్వానం అందలేదు. ఇంత పెద్దయెత్తున పార్టీ ప్రోగ్రాం జరిగినా కీలక నేతలు తుమ్మల, పొంగులేటి రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీ పార్ధసారధిరెడ్డి ఆహ్వానించినా పార్టీ పరంగా జిల్లా నేతలు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు.

ఇకపోతే, ఇవాళ సత్తుపల్లి వెళ్లి పార్ధసారధి రెడ్డిని కలిసి అభినందించారు తుమ్మల. ఈ సందర్భంగానే వారి మధ్య నిన్నటి సభపై చర్చ జరిగింది. అప్పుడే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. పార్టీ పరంగా పిలుస్తారని అనుకున్నా పిలవలేదని, అందుకే తాను రాలేదని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితమే తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయుల సమ్మేళనం పేరుతో నిర్వహించిన సభ టీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సభ వెనుక పార్టీ మారే ఉద్దేశ్యం ఉందంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, అదే సభా వేదికగా పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. టీఆర్ఎస్‌ను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకు సహజం అని, కేసీఆర్ వెంటనే తాను ఉంటానని స్పష్టం చేశారు తుమ్మల. తన అనుచరులను కూడా పార్టీ కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు తుమ్మల. ఆ ఎపిసోడ్ హీట్ తగ్గక ముందే.. ఎంపీల సన్మాన కార్యక్రమం మరింత రచ్చ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..