Telangana: తెలంగాణ సర్కార్ దీపావళి గిఫ్ట్.. ఆ బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ..
దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రజలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆస్తి పన్ను బకాయిలపై ఏకంగా 90 శాతం వడ్డీని మాఫీ చేసింది.
దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రజలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆస్తి పన్ను బకాయిలపై ఏకంగా 90 శాతం వడ్డీని మాఫీ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది సర్కార్. అవును మీరు విన్నది నిజంగా నిజం. ఎవరైతే ఆస్తి పన్ను బకాయిలు ఉన్నారో, వారు తమ బకాయిలను చెల్లిస్తే 90 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట దీనికి సంబంధించి జీవో జారీ చేశారు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడీలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘వన్ టైమ్ స్కీమ్(OTS)’ కింద 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల మొత్తాన్ని, 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 90 శాతం వడ్డీని వన్ టైమ్ స్కీమ్ కింద మాఫీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం 31-10-2022 వరకు మాత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారులు ఈ స్కీమ్ కింద బకాయిలను క్లియర్ చేస్తే 90 శాతం వడ్డీ మాఫీతో పాటు, పెనాల్టీలను సైతం రద్దు చేస్తారు. భవిష్యత్ చెల్లింపుల్లో దీని ప్రభావం ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చిన అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించాలని, ఓటీఎస్ పథకాన్ని యూజ్ చేసుకుని పన్ను బకాయిలు క్లియర్ చేయాలిన మున్సిపల్ శాఖ కార్యదర్శి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ లోకల్ బాడీల్లో రూ.1,999.24 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ శాఖ ప్రకటించింది. వీటి వడ్డీ 1,626.83 కోట్లు ఉంది. ఈ ఓటీఎస్ స్కీమ్ కింద ఆస్తి పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలు చెల్లిస్తే ప్రభుత్వానికి కనీసం రూ. 2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారలు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..