Khammam: నర్సింగ్‌ విద్యార్ధిని కావ్య ఆత్మహత్య.. మిస్టరీగా డెత్‌ కేస్‌!

ఖమ్మంలో జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బుధవారం (జూన్‌ 21) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన..

Khammam: నర్సింగ్‌ విద్యార్ధిని కావ్య ఆత్మహత్య.. మిస్టరీగా డెత్‌ కేస్‌!
Nursing Student Kavya
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 22, 2023 | 8:54 AM

ఖమ్మం: ఖమ్మంలో జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బుధవారం (జూన్‌ 21) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ (ఏఎన్‌ఎం) చదువుతోంది. బీకే బజార్‌లోని ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ కావ్య స్నేహితురాలైన సీతామహాలక్ష్మితో కలిసి ఓ అద్దె గదిలో ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన కావ్య నిద్రపోయింది. బుధవారం ఉదయం నిద్రపోతుండగా.. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. కావ్య మరో స్నేహితురాలైన తనుశ్రీ ఆమె ఉంటున్న గదికి వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్లేందుకు ప్రయత్నించింది.

ఇలా కిందకి వెళ్తుండగా తనుశ్రీకి పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని కావ్య గదికి వెళ్లిన తనుశ్రీ అక్కడి దృష్యం చూసి షాకయ్యింది. గదిలో కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు కావ్యను కిందకు దించారు. అప్పటికే కావ్య మృతి చెందినట్లు గ్రహించారు. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉన్నట్లు తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తన తల్లి రమాదేవికి ఫోన్‌ చేసింది. తనకు జాగ్రత్తలు చెప్పినట్లు తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తల్లి రమాదేశి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి