Telangana Municipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

Telangana Municipal Corporation Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరుగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

Telangana Municipal Elections 2026 Live: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Telangana Municipal Elections

Edited By:

Updated on: Feb 11, 2026 | 6:38 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పురపోరు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుండగా, ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 25.61 లక్షల మందికాగా, మహిళలు 26.80 లక్షల మంది ఉన్నారు. వీరి కోసం 8 వేల 191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ ఎన్నికల కోసం మొత్తం 16 వేల 031 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 136 సెంటర్లను సిద్ధం చేశారు

మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2 వేల 569 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2 వేల 358 మంది, బీఆర్ఎస్ నుంచి 2 వేల 478 మంది, బీజేపీ నుంచి 2 వేల 252 మంది సహా మొత్తం 10 వేల 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల కోసం 6 వేల 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410, బీఆర్ఎస్ నుంచి 401, బీజేపీ నుంచి 382 మంది సహా మొత్తం 2 వేల 225 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలో 2 వేల 174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు రాష్ట్రంలో వెయ్యి 302 అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాలు, వెయ్యి 926 కేంద్రాలను సమస్యాత్మకమైన కేంద్రాలు గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం వెయ్యి 379 మంది రిటర్నింగ్ అధికారులు, 41 వేల 773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీరిలో జనల్ అధికారులు 742 మంది, FST బృందాలు 279 మంది, SST బృందాలు 381 మంది, అసిస్టెంట్‌ ఆర్వోలు వెయ్యి 547 ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Feb 2026 05:02 PM (IST)

    తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఓటింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగానే జరుగింది. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్ సరళిని 100 శాతం వెబ్ కాస్టింగ్‌తో ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 62.5 శాతం పోలింగ్ నమోదు అయింది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోలిస్తే మున్సిపాలిటీలలో ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. కాగా సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. కాగా శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

  • 11 Feb 2026 04:24 PM (IST)

    కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    మ.3 గంటల వరకు 62.55 శాతం పోలింగ్ నమోదు

    మున్సిపాలిటీల్లో 66.10 శాతం పోలింగ్ నమోదు

    కార్పొరేషన్లలో 53.94 శాతం పోలింగ్ నమోదు

    100 శాతం వెబ్‌ కాస్టింగ్‌తో పోలింగ్‌ సరళి పరిశీలన

  • 11 Feb 2026 04:23 PM (IST)

    నిర్మల్ జిల్లా భైంసాలో దొంగ ఓట్ల కలకలం

    26వ పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్‌ ఆందోళన

    బుర్ఖాలు వేసుకుని దొంగ ఓట్లు వేసి వెళ్లిపోతున్నారని నిరసన

    పోలీసులు కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపాటు

  • 11 Feb 2026 03:43 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

    ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి

    మక్తల్ మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఓటు వేసిన మంత్రి

  • 11 Feb 2026 03:42 PM (IST)

    తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    మధ్యాహ్నం 3గంటల వరకు 62.09 శాతం పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 02:43 PM (IST)

    ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత

    26వ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ

    ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ ఇరువర్గాల మధ్య ఘర్షణ

    పోలీసులు కూడా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం

    ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • 11 Feb 2026 02:34 PM (IST)

    ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.54 శాతం పోలింగ్ నమోదు

    తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.54 శాతం పోలింగ్ నమోదు

    మున్సిపాలిటీల్లో 51.66, కార్పొరేషన్లలో 40.96 శాతం పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 02:21 PM (IST)

    మేడ్చల్‌ మధ్యాహ్నం 1గంట వరకు 60.14 శాతం పోలింగ్

    మేడ్చల్‌ మున్సిపాలిటీలలో కొనసాగుతున్న పోలింగ్

    మధ్యాహ్నం 1గంట వరకు 60.14 శాతం పోలింగ్ నమోదు

    ఎల్లంపేట్‌లో – 57.8 శాతం పోలింగ్ నమోదు

    అలియాబాద్‌లో- 59.7 శాతం పోలింగ్ నమోదు

    చింతలపల్లిలో – 63.54 శాతం పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 01:38 PM (IST)

    పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేస్తే పీఎస్‌కేః డీజీపీ

    మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగినవి చిన్న గొడవలే అన్నారు. పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేస్తే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.

  • 11 Feb 2026 01:35 PM (IST)

    ఓటు వేసిన మంత్రి జూపల్లి

    వనపర్తి జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు వేశారు. కొల్లాపూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 11 Feb 2026 01:33 PM (IST)

    మొత్తంగా ఇప్పటి వరకు 28.48% పోలింగ్ నమోదు..

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం కొనసాగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా పండుగ వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. అయితే ఉదయం 11గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 23.26 % పోలింగ్ నమోదు అయ్యింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా 28.46 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 18.94 శాతం పోలింగ్ నమోదైంది. ఇక 116 మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ శాతం పరిశీలిస్తే మొత్తంగా 30.62% నమోదైంది. అత్యధిక పోలింగ్ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మున్సిపాలిటీలో 47.52 శాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా నిర్మల్ మున్సిపాలిటీలో 14.30 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

  • 11 Feb 2026 01:24 PM (IST)

    పండగ వాతావరణంలో పోలింగ్ః ఎస్ఈసీ

    వంద శాతం వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ జరుగుతుందని, పోల్ శాతం కాస్త మందకొడిగా సాగుతుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆమె , యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని, పండగ వాతావరణంలో పోలింగ్ జరుగుతుందన్నారు. వెబ్ కాస్టింగ్ అనేది ఓటు వేయాలని అవగాహన చేయడమే అన్నారు.

  • 11 Feb 2026 01:14 PM (IST)

    కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత

    –కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత

    –బీఆర్‌ఎస్‌ నేత తిరుపతి అరెస్ట్‌పై మాజీ మంత్రి గంగుల ఆగ్రహం

    –తిరుపతి అరెస్ట్‌ను అడ్డుకున్న గంగుల కమలాకర్‌

    –పోలీస్‌ వాహనంలో నుంచి తిరుపతిని విడిపించిన గంగుల

    –పోలీసుల తీరుపై గంగుల కమలాకర్‌ మండిపాటు

  • 11 Feb 2026 01:11 PM (IST)

    ఓటు వేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

    రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జోగిపేట మున్సిపాలిటీ లోని 9 వార్డు లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ – 13 లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 11 Feb 2026 12:55 PM (IST)

    ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధం: మంత్రి పొన్నం

    హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఆయుధం.. పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు.. అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉంది. ప్రతి అర్బన్ ఓటర్లు బయటకు వచ్చి ఓట్లు వేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు.

  • 11 Feb 2026 12:38 PM (IST)

    కాంగ్రెస్‌పై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

    కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారులను ఏజెంట్లుగా వాడుకుంటోందని జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు గురించి అధికారులు ఆలోచించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను తనకు సహకరించాలని అడుగుతున్నారని, అధికారుల సహాయంతోనే కాంగ్రెస్ గెలవాల్సిన దుస్థితికి వచ్చిందని జగదీశ్ రెడ్డి అన్నారు.

  • 11 Feb 2026 12:34 PM (IST)

    నిజామాబాద్‌లో పోలీసుల వార్నింగ్‌

    –నిజామాబాద్ 19వ డివిజన్‌లోని మారుతీనగర్‌లో ఉద్రిక్తత

    –కాంంగ్రెస్‌, బీజేపీ నేతల ప్రచారంపై పోలీసుల ఆగ్రహం

    –ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలతో లాఠీలకు పని చెప్పిన పోలీసులు

    –కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

    –ఓటర్లను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదంటూ పోలీసుల వార్నింగ్‌

     

  • 11 Feb 2026 12:32 PM (IST)

    రామయంపేటలో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఫైట్

    మెదక్ జిల్లా రామయంపేటలో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ ఫైట్

    7వ వార్డులో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తల ఆరోపణలు

    కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట

    రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

    కాంగ్రెస్‌ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహం

  • 11 Feb 2026 12:31 PM (IST)

    పోలీసులతో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్వాదం

    — వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత

    — పోలింగ్‌ కేంద్రం దగ్గర పోలీసులతో BJP నేతల వాగ్వాదం

    — పోలీసులు కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపణ

    — పరస్పర నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.

    — పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట

     

     

  • 11 Feb 2026 12:28 PM (IST)

    నిజామాబాద్‌ను క్లీన్ ఇందూరుగా మార్చుకుందాంః అరవింద్

    నిజామాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వినాయక నగర్‌ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామం కోసం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలని అరవింద్ పిలుపునిచ్చారు. పోలింగ్‌లో నిజామాబాద్ రికార్డ్ బ్రేక్ చేయాలని, అవినీతిరహిత అభ్యర్థును ఎన్నుకుని ఓటర్లు మార్పుకు నాంది పలకాలని అరవింద్‌ కోరారు. నిజామాబాద్‌ను క్లీన్ ఇందూరుగా మార్చుకుందామన్నారు BJP MP అరవింద్.

     

  • 11 Feb 2026 12:06 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బండి

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కరీంనగర్ 50వ డివిజన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఓటు వేశారు. జ్యోతినగర్ ఎస్సార్ హైస్కూల్‌లోని 361 పోలింగ్ బూత్‌లో బండి సంజయ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    Bandi Sanjay Vote Casting

     

  • 11 Feb 2026 11:15 AM (IST)

    ఓటు వేసిన వందేళ్ల వృద్ధురాలు

    — యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసిన వందేళ్ల వృద్ధురాలు

    — మోత్కూరు 9వ వార్డు 20వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన రంగమ్మ

    — ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచిన రంగమ్మ

  • 11 Feb 2026 11:14 AM (IST)

    ఆకట్టుకున్న ఆదర్శ మోడల్ పోలింగ్ కేంద్రం

    నిర్మల్ జిల్లా భైంసా కిసాన్ గల్లీలో 41, 42 బూత్ లకు చెందిన ఆదర్శ మోడల్ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటోంది. అధికార యంత్రాంగం ఈ పోలింగ్ కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దింది. స్వాగత తోరణంతో పాటు పూల మొక్కలు, రంగు రంగుల పూలతో ముస్తాబు చేశారు. కాగా ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన మొదటి వంద మందికి మొక్కలు పంపిణీ చేశారు.

  • 11 Feb 2026 11:14 AM (IST)

    ఓటు వేసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

    వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో వార్డ్ నెంబర్ 23లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్రికుంటలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓటేశారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిరంజన్‌ రెడ్డి కోరారు.

  • 11 Feb 2026 11:13 AM (IST)

    వీల్ ఛైర్స్‌ లేవంటూ దివ్యాంగుల ఆందోళన

    మెదక్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే.. 4వ వార్డులో వీల్‌ ఛైర్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెదక్‌లో ఎన్నికల అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీల్ ఛైర్స్‌ లేకుంటే దివ్యాంగులను ఎలా తీసుకెళ్లాలంటూ మండిపడ్డారు.

  • 11 Feb 2026 11:11 AM (IST)

    ప్రజా సంక్షేమం – అభివృద్ధియే లక్ష్యంః భట్టి

    ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిర మున్సిపాల్టీ 9వ వార్డులోని పోలింగ్ కేంద్రంలో భట్టి ఓటు వేశారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజల సంక్షేమం – అభివృద్ధి కోసమే అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.

  • 11 Feb 2026 10:57 AM (IST)

    కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

    తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేశారు. కొడంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

    Cm Revanth Reddy Vote Cast

  • 11 Feb 2026 10:50 AM (IST)

    భూపాలపల్లి మున్సిపాలిటీలో డబ్బుల కలకలం

    భూపాలపల్లి మున్సిపాలిటీలో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా.. 22వ వార్డులో డబ్బుల పంపిణీకి దిగారు. ఓటుకు రూ.5వేల చొప్పున కట్టలు కట్టి పంపిణీ చేస్తున్నారు. పోలీసులు పట్టుకోవడంతో డబ్బు వదిలేసిన కార్యకర్తలు పరారయ్యారు. పోలీసులు లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి.. డబ్బు పంపిణీ చేస్తున్నాడని ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

  • 11 Feb 2026 10:48 AM (IST)

    పోలింగ్‌ ప్రశాంతంగానే కొనసాగుతుందిః ఎస్పీ

    ఖానాపూర్‌లోని మున్సిపల్‌ ఎన్నికల కేంద్రాన్ని జిల్లా SP జానకీ షర్మిల సందర్శించారు. పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్‌ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగానే కొనసాగుతుందని SP జానకీ షర్మిల తెలిపారు.

     

  • 11 Feb 2026 10:47 AM (IST)

    ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ

    –నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది.

    –కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

    –ఓటర్లను తీసుకెళ్లే ఆటోల్లో ప్రచారం చేస్తున్నారంటూ రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు.

    –కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా.. పోలీసులు అడ్డుకున్నారు.

  • 11 Feb 2026 10:46 AM (IST)

    మహబూబాబాద్ లో తోపులాట

    — మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్, BRS కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది

    — ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం వాగ్వివాదానికి దిగారు

    — ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు

  • 11 Feb 2026 10:42 AM (IST)

    పరిగి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత

    — వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత

    — 13వ వార్డు, 27వ నెంబర్‌ పోలింగ్‌ స్టేషన్‌లో బోగస్ ఓట్ల కలకలం

    — కాంగ్రెస్, BRS నాయకుల మధ్య వాగ్వాదం

    — పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌ రెడ్డి వాగ్వాదం

    — ఇరుపార్టీల నేతలను పోలింగ్‌ స్టేషన్‌ నుంచి పంపించేసిన పోలీసులు

  • 11 Feb 2026 10:41 AM (IST)

    తొలి ఓటు వేయడం సంతోషంః వెంకట్ రెడ్డి

    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ కార్పొరేషన్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బయటకు వచ్చి ఓట వేయాలని, 80శాతం ఓటింగ్ జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు

  • 11 Feb 2026 10:39 AM (IST)

    పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం

    — సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పోలీసుల తీరుపై ఓటర్ల ఆగ్రహం

    — దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులతో మహిళ వాగ్వాదం

    — ఓటర్లపై దాడి చేస్తున్నారంటూ ఆరోపణ

  • 11 Feb 2026 10:11 AM (IST)

    అభ్యర్థుల గుర్తులు తారుమారుతో గందరగోళం

    మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో పోలింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 45వ డివిజన్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారవడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలింగ్ కేంద్రం దగ్గర అభ్యర్థుల ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అభ్యర్థులకు నచ్చచెప్పారు. అధికారుల జోక్యంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో తిరిగి పోలింగ్ ప్రారంభమైంది.

  • 11 Feb 2026 09:21 AM (IST)

    పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్‌ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పట్టణ ఓటర్లు పోలింగ్ బూతుల మధ్య క్యూ కట్టారు. పోలింగ్ సరళని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్ట్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి, తగిన సూచనలు ఇస్తున్నామన్నారు.

  • 11 Feb 2026 09:18 AM (IST)

    కుటుంబ సమేతంగా ఓటేసిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

    వికారాబాద్‌ మున్సిపాలిటీకి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. పోలింగ్ శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇక ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు క్యూ కట్టారు.

  • 11 Feb 2026 08:14 AM (IST)

    అభ్యర్థి కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

    నారాయణపేట్ జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థి మరణంతో 6వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మహదేవ్‌ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థుల ఒత్తిళ్లవల్లే సూసైడ్‌ చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో BJP దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కాగా, అభ్యర్థి మహాదేవ్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం కిషన్‌రెడ్డి ఈ అంశాన్ని లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఎంపీ డీకే అరుణ, బీజేపీ కార్యకర్తలతో కలిసి మహదేవ్‌ ఇంటికి వెళ్లిన కిషన్‌రెడ్డి.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • 11 Feb 2026 07:34 AM (IST)

    ఓటర్‌ కార్డు లేకపోయినా పర్లేదు..!

    ఓటు వేయడానికి ఓటర్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

    ఈ పత్రాల ద్వారా కూడా మీ ఓటు వేయవచ్చుః

    1. ఆధార్ కార్డ్

    2. పాస్‌పోర్ట్

    3. డ్రైవింగ్ లైసెన్స్

    4. PAN కార్డ్

    5. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్

    6. అధికారిక గుర్తింపు కార్డ్

    7. పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)

    8. సర్వీస్ ఐడెంటిటీ కార్డ్

    9. స్మార్ట్‌కార్డ్ (RGI ద్వారా జారీ చేయబడింది)

    10. బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటోతో)

    11. దివ్యాంగ్ ప్రత్యేక ID

  • 11 Feb 2026 07:21 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    – ఒక కార్పోరేషన్‌.. 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — 328 వార్డుల్లో ఓటు వేయనున్న6,69,212 ఓటర్లు

    — సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంపు

    — భైంసా, నిర్మల్, కాగజ్ నగర్, క్యాతన్ పల్లిలో బలగాల మోహరింపు

    — అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గా 432

    — సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 130

    — అత్యంత సమస్యాత్మక మున్సిపాలిటీ బైంసా పై ఫోకస్ పెట్టిన పోలీసులు

  • 11 Feb 2026 07:13 AM (IST)

    పోలింగ్‌ను పరిశీస్తున్న ఎస్ఈసీ రాణి కుముదిని

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని పరిశీలించారు. ఎన్నికల సంఘం బిల్డింగ్‌లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి ఆమె పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను అందించాలని సూచించారు.

  • 11 Feb 2026 07:11 AM (IST)

    భైంసాలో పరిస్థితి ఉద్రిక్తం

    –నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు

    –9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్‌పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడి

    –అరవింద్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ మునీమ్‌పై దాడి

    –ఏజెంట్‌ ఫామ్స్‌ ఫిల్ చేస్తుండగా దాడి చేశారని ఆరోపణలు

    –సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దాడి దృశ్యాలు

    –పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు అరవింద్

  • 11 Feb 2026 07:10 AM (IST)

    ఖమ్మం ఓటరు తీర్పు ఎవరికో..!

    — ఖమ్మం ఓటరు తీర్పు ఎప్పుడూ కాస్త విలక్షంగానే ఉంటుంది.

    — కాంగ్రెస్‌, BRS, BJP, కమ్యూనిస్టులు ఎవరికివారు సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు.

    — జిల్లా మంత్రులు ముగ్గురూ కూడా తమ తమ పరిధిలో ఆధిపత్యం కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

    — ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7మున్సిపాలిటీల్లో ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది..

    — కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి.. అలాంటి చోట భద్రత రెట్టింపు చేశారు.

  • 11 Feb 2026 07:08 AM (IST)

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోలింగ్ షురూ

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది.

    –కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో పోలింగ్‌ జరుగుతుంది.

    –126 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

    –13 మున్సిపాలిటీల్లో 1,570 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు.

    –1,581 పోలింగ్ కేంద్రాలు దగ్గర 8వేల900 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.

  • 11 Feb 2026 07:07 AM (IST)

    మహబూబ్‌ నగర్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్

    — ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — అందులో 59 డివిజన్‌లు, 314 వార్డుల.

    — ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 971 పోలింగ్ కేంద్రాలు

    — మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ ఏకగ్రీవం కాగా..

    అలంపూర్‌లో 10వ వార్డు కూడా ఏకగ్రీవం అయ్యింది

    — మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వార్డులో బీజేపీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది.

    — మున్సిపల్ బరిలో 15వందల 70 మంది అభ్యర్థులు

  • 11 Feb 2026 07:03 AM (IST)

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో పోలింగ్

    — ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ జరుగుతోంది

    — ఒక కార్పొరేషన్‌.. 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి

    — మంత్రులంతా కూడా ఎలక్షన్‌ను సీరియస్‌గానే తీసుకున్నారు.

    — విపక్షాలు కూడా ప్రచారం హోరెత్తించాయి.

    – మొత్తం కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 6లక్షల 68వేల మంది ఓటర్లు ఇప్పుడు తీర్పు ఇవ్వబోతున్నారు.

  • 11 Feb 2026 07:02 AM (IST)

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు పోలింగ్

    — ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సహా 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — మొత్తం వార్డులు 238, పోలింగ్ కేంద్రాలు 968

    — బరిలో ఉన్న అభ్యర్థులు 1,161

    — ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,44,990 మంది ఓటర్లు

    — 3 వేల మంది పోలీసులతో బందోబస్తు

    — అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 247గా గుర్తింపు

  • 11 Feb 2026 07:01 AM (IST)

    వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    260 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 1073 మంది అభ్యర్థుల పోటీ

    ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు

  • 11 Feb 2026 06:59 AM (IST)

    సీతారాంపేట్‌లో ఉద్రిక్తత

    రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్‌లో ఉద్రిక్తత నెలకొంది. గడువు ముగిసినా పలువురు ఇంకా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇతర గ్రామాల వాళ్లు ఇంకా ప్రచారం చేస్తున్నారని BRS కౌన్సిలర్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 11 Feb 2026 06:58 AM (IST)

    చెన్నూరులో టెన్షన్ వాతావరణం

    మంచిర్యాల జిల్లా చెన్నూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. BRS నేత, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్ మూల రాజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని BRS ఆరోపించింది. అందుకే సోదాల పేరుతో తమ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నారని రాజిరెడ్డి విమర్శించారు.

  • 11 Feb 2026 06:56 AM (IST)

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ..!

    116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొదలైన పోలింగ్

    సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

    116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్

    బరిలో నిలిచిన 10,719 మంది అభ్యర్థులు

    7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు

    పోటీలో నిలిచిన 2,225 మంది అభ్యర్థులు

    ఓటు హక్కు వినియోగించుకోనున్న 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు

    పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

    అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు

    ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు

    41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించిన ఎన్నికల సంఘం

Follow Us