AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆ ప్రాంతాన్ని GHMCలో కలిపేద్దామా? సరికొత్త చర్చకు తెరలేపిన మంత్రి కేటీఆర్

కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? నాకు సమ్మతమే..మరి మీరేమంటారు? మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌...

Hyderabad: ఆ ప్రాంతాన్ని GHMCలో కలిపేద్దామా? సరికొత్త చర్చకు తెరలేపిన మంత్రి కేటీఆర్
Minister Ktr
Balaraju Goud
|

Updated on: Sep 22, 2021 | 12:30 PM

Share

Minister KTR on Secunderabad Cantonment: కంటోన్మెంట్‌ బోర్డును జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? నాకు సమ్మతమే..మరి మీరేమంటారు? మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ ఇటీవల ఊపందుకుంది. దీనిపై స్పందించిన కేటీఆర్..ప్రజాభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్లు చెప్పారు. మరి మీరు ఏమంటారు అంటూ ట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కొందరు కంటోన్మెంట్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు.. బ్రిటిష్‌ పరిపాలనను గుర్తుకు తెస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలతో దాదాపు 10 లక్షల మందికిపైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సమస్య, అభివృద్ధికి ఏకైక పరిష్కారం కంటోన్మెంట్‌ బోర్డును GHMCలో కలపడమే అంటూ చాలా మంది ట్వీట్ చేశారు..

అయితే, మరికొందరు మాత్రం ఇది అంతా ఈజీ కాదంటున్నారు.. కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఉంటుంది. దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి.మరి ఇది అయ్యే పనేనా అంటూ మరికొందరు ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు GHMC చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లను కూడా గ్రేటర్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

కంటోన్మెంట్ సమస్య ఈనాటిది కాదు. ఇక్కడి లోకల్ మిలిటరీ అథారిటీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఇష్టంవచ్చినట్టుగా రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి. కరోనా టైమ్‌లో అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను మూసివేశారు. ఈ సమస్యను ప్రస్తావిస్తూ గతంలో మంత్రి కేటీఆర్‌.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ కూడా రాశారు..

Read Also…  Indian Rupee: ఒక్క కరెన్సీ నోటు ముద్రణకు ఆర్‌బీఐ ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు మీకోసం..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!