Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Rupee: ఒక్క కరెన్సీ నోటు ముద్రణకు RBI ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు మీకోసం..

Reserve Bank of India: దేశంలో కరెన్సీని జారీ చేసే అధికారం ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం కనీస రిజర్వ్ సిస్టమ్‌ను ఆర్‌బిఐ అనుసరిస్తుంది.

Indian Rupee: ఒక్క కరెన్సీ నోటు ముద్రణకు RBI ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు మీకోసం..
Notes
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2021 | 12:23 PM

Reserve Bank of India: దేశంలో కరెన్సీని జారీ చేసే అధికారం ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం కనీస రిజర్వ్ సిస్టమ్‌ను ఆర్‌బిఐ అనుసరిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనను 1956లో రూపొందించారు. దీని ప్రకారం.. కరెన్సీ ముద్రణ కోసం ఆర్బీఐ వద్ద ఎల్లప్పుడూ రూ. 200 కోట్లు కనీస నిల్వలు ఉండాలి. ఇందులోనూ రూ. 115 కోట్ల విలువైన బంగారం నిల్వలు, రూ. 85 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీ ఉండాలి. ఇదిలాఉంటే.. మనం నిత్యం వినియోగించే 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

కరెన్సీ నోట్లకు ఉండే విలువ.. ఆ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చులో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్క 100 రూపాయల నోటును ముద్రించేందుకు ఆర్బీఐకి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక 200 నోటు ముద్రణకు రూ. 2.93 ఖర్చు అవుతుంది. ఈ 200 రూపాయల నోటు పొడవు, వెడల్పు మధ్య నిష్పత్తి 66 X 146 mm² గా ఉంటుంది. ఒక 200 రూపాయల నోటుపై సాంచి స్థూపం ఉంటుంది. అదే విధంగా 500 రూపాయల నోటు ముద్రణకు రూ. 2.94 ఖర్చు అవుతుంది. ఈ నోటుపై ఎర్రకోట చిత్రాన్ని ముద్రిస్తారు.

దేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు 2000. ప్రస్తుతం దీని ముద్రణను నిలిపివేసింది ఆర్బీఐ. పాత నోట్ల రద్దు తరువాత 2000 రూపాయల నోటును ఆర్బీఐ ముద్రించింది. ఈ 2000 రూపాయల నోటు వెడల్పు, పొడవు నిష్పత్తి 66 X 166 mm². ఈ నోటుపై ‘మంగళయాన్’ చిత్రాన్ని ముద్రించారు. ఈ నోటును ముద్రించడం కోసం ఆర్బీఐ రూ. 3.54 ఖర్చు చేస్తుంది. ఇలా ఒక్కో నోటు ముద్రణకు ఒక్కో స్థాయిలో ఖర్చు అవుతుంది.

ఇదిలాఉంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నాటి బ్రిటీష్ గవర్నమెంట్ స్థాపించింది. ఆర్బీఐ ద్వారా జారీ చేయబడిన మొదటి కరెన్సీ నోటు రూ. 5 నోటు. ఈ నోటును రూ. 1938లో ముద్రించారు. దీనిపై కింగ్ జార్జ్ VI ఫోటో ఉంటుంది. భారతీయ కరెన్సీని రూపాయిలలో పిలుస్తారు. దీని చిహ్నం ‘‘₹’’.

Also read:

Melbourne Earthquake: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం.. మెల్‌బోర్న్‌లో కుప్పకూలిన భవనాలు.. షాకింగ్ దృశ్యాలు..