Tomato Plant: బాప్‌ రే.. ఇలాంటి చెట్టును మీ జీవితంలో చూసుండరు.. ఒక్క కొమ్మకు 839 టమాటాలు..

Tomato Plant: ఇంగ్లాండ్‌లో అద్భుతం జరిగింది. టమాటా మొక్కలోని ఒక కొమ్మకు ఏకంగా 8 వందలకు పైగా టమాటాలు కాసాయి. దాంతో ఈ టమాటా మొక్క గిన్నిస్‌ రికార్డ్స్‌ వైపు పరుగులు తీస్తోంది.

Tomato Plant: బాప్‌ రే.. ఇలాంటి చెట్టును మీ జీవితంలో చూసుండరు.. ఒక్క కొమ్మకు 839 టమాటాలు..
Tomota
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 22, 2021 | 9:52 AM

Tomato Plant: ఇంగ్లాండ్‌లో అద్భుతం జరిగింది. టమాటా మొక్కలోని ఒక కొమ్మకు ఏకంగా 8 వందలకు పైగా టమాటాలు కాసాయి. దాంతో ఈ టమాటా మొక్క గిన్నిస్‌ రికార్డ్స్‌ వైపు పరుగులు తీస్తోంది. ఒక కొమ్మకు ఇన్ని టమాటాలు కాయడం సాధ్యమా? అని మీకు సందేహం కలగొచ్చు.. కానీ ఇది నిజం. లండన్‌కి చెందిన 43 సంవత్సరాల స్మిత్ వృత్తి రీత్యా IT మేనేజర్. అయితే, తాజాగా అతడు ఓ ప్రయత్నం చేసి ప్రపంచ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. అదేంటంటే ఒకే కాండానికి 839 టమాటాలు కాయించాడు. అయితే ఇవి చెర్రీ జాతికి చెందిన చిన్న టమాటాలు.

2021 మార్చి నెలలో స్మిత్‌ 8 అడుగుల విస్తీర్ణంలో టమాటా గింజలు నాటాడు స్మిత్‌. అవి సెప్టెంబరులో కాయలు కాయడం మొదలుపెట్టాయి. స్మిత్ గింజలు నాటినప్పటి నుంచి ప్రతి రోజూ 3 నుంచి 4 గంటల పాటు అక్కడే సమయం గడుపుతూ వాటికి కావల్సిన పోషణ అందించాడు. స్మిత్ దీని పోషణ కోసం ఎంతో స్టడీ చేశాడు. దీంతో ఏ సమయానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ వచ్చాడు. దీంతో ఒకే కాండానికి 839 చెర్రీ టమాటాలు కాశాయి. స్మిత్ వెంటనే గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులకు ఈ సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి టమాటాలు లెక్కించి మొత్తం సమాచారాన్ని సేకరించి తీసుకెళ్లారు. దీంతో 2010 లో గ్రహమ్ ట్రాంటర్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. గ్రహమ్ అప్పట్లో ఒకే కాండానికి 488 టమాటాలు కాయించాడు. అయితే స్మిత్ గిన్నీస్ రికార్డు సాధించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అతడు యూకే లోనే టాలెస్ట్ సన్ ఫ్లవర్ చెట్టును పెంచాడు. ఈ చెట్టు ఎత్తు 20 అడుగులు. అంతేకాదు గత ఆగస్టులో 3 కేజీల టమాటాను కూడా కాయించాడు. ఇలా రికార్డులమీద రికార్డులు నెలకొల్పుతూ స్మిత్ యూకే వాసులకు సుపరిచితుడే.

Also read:

Viral Video: హుషారైన కోతి.. జింకపై కూర్చొని స్వారీ.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.. వీడియో

Joe Biden: కొత్త ప్రచ్ఛన్న యుద్ధం మాకు అక్కరలేదు..శాంతియుత మార్గాలను అనుసరించే దేశాలతో కలిసి పనిచేస్తాం.. అమెరికా

Anand Mahindra: భారతీయుల అల్పాహారంపై ఆనంద్ మహీంద్ర ఫన్నీ ట్వీట్.. లైక్స్, రీ ట్వీట్లతో హోరెత్తుతున్న సోషల్‌ మీడియా..