Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై దాడి కేసులో పురోగతి.. ఐదుగురు నిందితుల అరెస్ట్!

Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఇంటిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆయ‌న నివాసం వ‌ద్ద ఉన్న నేమ్ బోర్డులు, ట్యూబ్ లైట్స్, పూల‌కుండిల‌ను ద్వంసం చేశారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై దాడి కేసులో పురోగతి.. ఐదుగురు నిందితుల అరెస్ట్!
Asaduddin Owaisi House
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 22, 2021 | 11:43 AM

Asaduddin Owaisi’s House attacked: ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఇంటిపై అర్ధరాత్రి దుండగులు దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆయ‌న నివాసం వ‌ద్ద ఉన్న నేమ్ బోర్డులు, ట్యూబ్ లైట్స్, పూల‌కుండిల‌ను ద్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు.. వెంట‌నే ఓవైసీ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఎంపీ అధికారిక నివాసంపై ఈ దాడి జ‌రిగిందని పోలీసులు నిర్ధారించారు. అయితే, ఈ దాడికి పాల్పడిన ఐదుగురు అల్లరి మూకలను ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

మంగళవారం ఢిల్లీలోని అశోక రోడ్డులో ఉన్న ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లీమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై దుండగులు దాడి చేశారు. మొత్తం 8మంది దుండగులు ఈ దాడి చేసేందుకు వ‌చ్చిన‌ట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు, దాడిపై ఓవైసీ తీవ్రంగా స్పందించారు. దేశ రాజ‌ధాని న‌డిబొడ్డున ఉన్న ఎంపీ అధికారిక నివాసంపైనే దాడి చేస్తారా…? దీనికి బీజేపీ ఎం చెప్తుంద‌ని ఆయ‌న ప్రశ్నించారు.

దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే నిందితులపై సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 427, 188 మరియు పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం నిరోధక చట్టం సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.

Read Also…  Earthquake in Australia: ఆస్ట్రేలియాలో భారీ భూకంపం.. కంపించిపోయి మెల్‌బోర్న్.. కుప్పకూలిన భవనాలు..

Crime News: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసిన భార్య

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!