Village President: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడ్ని నడిరోడ్డులో బూటుకాలితో తన్నిన సర్పంచ్.!
గ్రామ సమస్యల్ని పరిష్కరించి తమని ఉద్ధరిస్తాడని ఎన్నో ఆశలతో ఓటేసి ఎన్నుకున్న గ్రామస్తులకు బూటు కాలితో తన్నులు సమర్పిస్తున్నాడా సర్పంచ్.
Damastapur sarpanch kicked villager: గ్రామ సమస్యల్ని పరిష్కరించి తమని ఉద్ధరిస్తాడని ఎన్నో ఆశలతో ఓటేసి ఎన్నుకున్న గ్రామస్తులకు బూటు కాలితో తన్నులు సమర్పిస్తున్నాడా సర్పంచ్. ఈ వికృతమైన ఘటనలకు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా వేదికైంది. జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలో దామస్తాపూర్ గ్రామం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దామస్తాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీలో ఊరికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించాడు.
గ్రామ సమస్యలు చాలా వున్నాయ్.. నీటి సమస్య, డ్రైనేజి సమస్య వంటివాటి మీద దృష్టి పెట్టాలని దామస్తాపూర్ సర్పంచ్‌కు పిట్టల శ్రీనివాస్ మొరపెట్టుకున్నాడు. అక్కడే 2 రోజుల క్రితం జరిగిన ఒక గొడవ కోసం పంచాయితీ పెట్టిన సర్పంచ్ జైపాల్ రెడ్డి.. నీకెందుకు రా అని కొట్టడం.. బూటుకాలితో బురదలో వేసి తనడం మొదలు పెట్టాడు. కంగు తిన్న పిట్టల శ్రీనివాస్.. గ్రామ సమస్యలు అడగడానికి వస్తే ఇట్లా తనని వెళ్లగొడతారా అని వాపోయాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు శ్రీనివాస్ వెళ్లి సర్పంచ్ మీద ఫిర్యాదు చేశాడు. మర్పల్లి SI వెంకట శ్రీనుకు తన ఫిర్యాదును సమర్పించాడు.