Minister KTR: ఐటీ, సీబీఐ, ఈడీ లు బీజేపీకి కీలు బొమ్మల్లా మారాయి.. మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..

బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని వారాల క్రిత‌మే ప్రధాని మోడీపై బీబీసీలో డాక్యుమెంట‌రీ ప్రసారం అయ్యింద‌ని,..

Minister KTR: ఐటీ, సీబీఐ, ఈడీ లు బీజేపీకి కీలు బొమ్మల్లా మారాయి.. మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
Ts Minister Ktr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 14, 2023 | 4:58 PM

బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని వారాల క్రిత‌మే ప్రధాని మోడీపై బీబీసీలో డాక్యుమెంట‌రీ ప్రసారం అయ్యింద‌ని, ఇప్పుడు భార‌త్‌లోని బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు బీజేపీకి కీలు బొమ్మలా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థపై ఐటీ దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. లేదంటే ఆ సంస్థనే టేకోవ‌ర్ చేసుకుంటారా అని విమ‌ర్శించారు.

కాగా.. బీబీసీ ఆఫీస్ లపై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయి, ఢిల్లీల్లో ఉన్న కార్యాల‌యాల్లో రైడ్స్ జరిగాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ ట్యాక్సేష‌న్‌, ట్రాన్స్‌ఫ‌ర్ ప్రైసింగ్‌లో అక్రమాలు జ‌రిగిన‌ట్లు బీబీసీపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంద‌రు జ‌ర్నలిస్టుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తామేమీ సోదాలు చేయ‌డం లేద‌ని, కానీ స‌ర్వే చేస్తున్నట్లు కొంద‌రు ఐటీశాఖ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇటీవ‌ల గోద్రా అల్లర్లపై బీబీసీ ఛాన‌ల్ ఓ డాక్యుమెంట‌రీని విడుదల చేసింది. అయితే.. ఆ డాక్యుమెంట‌రీపై పెను దుమారం చెల‌రేగింది. ఈ నేప‌థ్యంలోనే క‌క్ష్య సాధింపుగా ఆ సంస్థపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం