FarmHouse Case: అసలు సినిమా ముందుంది.. ఫామ్‌హౌస్ ఘటనపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..
ఫామ్‌హౌస్ ఘటనపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మఠాధిపతుల వేషంలో ముఠా దిగి.. దొంగతనం చేయబోయి బొక్కబోర్లా పడిందని వ్యాఖ్యానించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఈ అంశంపై ..
ఫామ్‌హౌస్ ఘటనపై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మఠాధిపతుల వేషంలో ముఠా దిగి.. దొంగతనం చేయబోయి బొక్కబోర్లా పడిందని వ్యాఖ్యానించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారో యధావిధిగా తెలుసుకుందాం..‘దొంగతనం చేయడానికి ఒక ముఠా వచ్చింది. మఠాధిపతుల వేషంలో ఒక ముఠా వచ్చింది. ఆ ముఠా అడ్డంగా దొరికిపోయింది. దీనిపై విచారణ జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఉన్న తాను దానిపై కామెంట్స్ చేయడం సరికాదు. నేను ఏం మాట్లాడినా దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తారు. వెంటనే కేసును బదలాయించి కేంద్రం పరిధిలోని సీబీఐ, ఈడీకి అప్పగించాలని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తారు. ఆ ట్రాప్‌లో నేను పడను. ఆడియో క్లిప్పులలో అంతా తెలిసిపోయింది. వచ్చిన ముఠా ఎవరు? ఢిల్లీలో సంప్రదించిన పెద్దలు ఎవరు? ఎన్ని కోట్లకు డీల్ కుదురింది? ఏ రకంగా మాట్లాడారు? అనేది ఆడియో క్లిప్పుల్లో ఉన్న అంశాలను ప్రజలందరూ విన్నారు. ఎమ్మెల్యేలు కూడా బయటకు వస్తారు. ప్రజల ముందుకు అన్నీ చెబుతారు. వాళ్లు ఆణిముత్యాలు. మా నలుగురు ఎమ్మెల్యేలు గొప్పవాళ్లు. రూ. 100 కోట్లు ఆఫర్ ఇచ్చినా పట్టించుకోకుండా పార్టీ అధినేతకు వచ్చి చెప్పిన రోషం గల్ల తెలంగాణ బిడ్డలు. మునుగోడులో అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి మాదిరిగా కాకుండా నిబద్ధత కలిగిన వారు. దేశంలో ఎనిమిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ.. ఎక్స్‌పర్ట్ అయినట్లుగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తెలంగాణలోనూ ప్రయత్నం చేయబోయింది. కానీ, ఇక్కడ వారికి కేసీఆర్ తగిలారు. దెబ్బకు దెయ్యం దిగివచ్చింది. వారి బండారం మొత్తం బయటపడింది. చట్టం తన పని తాను చేసుకుంటుంది. దర్యాప్తు సంస్థలు చాలా విషయాలను రాబట్టాయి. అనేక సాక్ష్యాలు సేకరించాయి. వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. గంటల గంటల క్లిప్స్ ఉన్నాయి. అన్నీ బయటకు వస్తాయి. నిన్నా, మొన్నా వచ్చింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ఉంది. రాష్ట్రమే కాదు, దేశ ప్రజలంతా చూస్తారు. వెయిట్ అండ్ సీ’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..