Minister KTR: ‘పోతే వచ్చింది కాదు, అమ్ముడుపోతే వచ్చిన ఎన్నిక’.. మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోవడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ ..

Minister KTR: ‘పోతే వచ్చింది కాదు, అమ్ముడుపోతే వచ్చిన ఎన్నిక’.. మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్..
Minister Ktr Tv9
Follow us

|

Updated on: Oct 29, 2022 | 8:32 PM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోవడం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. కాంట్రాక్ట్ పొందిన విషయాన్ని రాజగోపాల్ రెడ్డి స్వయంగా అంగీకరించాడని పేర్కొన్నారు. మునుగోడును రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌లో పదవులు రాక బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. బీజేపీ పెద్దల ఆశీర్వాదం లేకుండా అంత పెద్ద కాంట్రాక్ట్ రాజగోపాల్‌కు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన అదానీని కూడా కాదని రాజగోపాల్‌కు ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

బెదిరించి పార్టీలో చేర్చుకోవడం బీజేపీ నైజం అని దుయ్యబట్టారు. సీఎం రమేష్, సుజనా చౌదరిపై కేసులు పెట్టారని, బీజేపీలోకి వెళ్లగానే వారిపై కేసులు మాయం అయ్యాయని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కుబేరుడినే బీజేపీ జేబులో పెట్టుకుందని విమర్శించారు. మునుగోడుకు కోట్ల రూపాయలు పంపుతున్నారని అన్నారు. మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది సున్నా అన్నారు. 5 నెలల్లో గుజరాత్‌కు లక్ష కోట్లు ఇచ్చారని, మరి తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. వరదలు వస్తే ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్‌ది అని అన్నారు. చర్లగూడెం భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తమ ఫ్యామిలీలో కూడా చాలా మంది భూనిర్వాసితులు ఉన్నారన్నారు. నిర్వాసితుల సమస్యలు తమకు తెలుసునని అన్నారు.

ఇవి కూడా చదవండి

మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారని అన్నారు. రోడ్డు రోలర్ గుర్తును బీజేపీ మళ్లీ పెట్టించిందని ఆరోపించారు మంత్రి. అధికారులను బీజేపీ నేతలు ఆడిస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం అన్న ఆయన.. ఎందుకు మారారు అన్నది చూడాలన్నారు. మంచి భవిష్యత్ కోసం తమ పార్టీలోకి వస్తారని, బెదిరింపులకు భయపడేవారు బీజేపీలోకి వెళ్తారని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..