Telangana: తెలంగాణలో దుమారం రేపుతున్న ఫామ్‌హౌజ్ ఇష్యూ.. మంత్రి కేటీఆర్ కామెంట్స్‌కి బండి స్ట్రాంగ్ కౌంటర్..
తెలంగాణ రాజకీయాల్లో ఫామ్‌హౌజ్ పాలిటిక్స్ దుమారం రేపుతున్నాయి. కమలదళానికి, గులాబీదళానికి మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..
తెలంగాణ రాజకీయాల్లో ఫామ్‌హౌజ్ పాలిటిక్స్ దుమారం రేపుతున్నాయి. కమలదళానికి, గులాబీదళానికి మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఈ వ్యవహారంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మీడియా ముఖంగా తొలిసారి స్పందించడంతో వ్యవహారం మరింత హీటెక్కింది. ఈ వ్యవహారంలో నిజానిజాలేమిటన్నది దర్యాప్తు సంస్థలే తేలుస్తాయని చెప్పారు కేటీఆర్. దీనిపై సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను సీఎం కేసీఆర్ చెబుతారన్నారు. ఇక, ఇదే అంశంపై యదాద్రిలో బండి సంజయ్ చేసిన ప్రమాణంపై.. సెటైర్లు వేశారు కేటీఆర్. అపవిత్రమైన యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని వేదపండితులకు సూచించారు.
అయితే, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటరిచ్చారు బండి సంజయ్. కేసీఆర్, కేటీఆర్ నోర్లనే సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో ఎపిసోడ్ అంతా నకిలీ వ్యవహారమన్నారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్‌చుగ్. అదే నిజమైతే.. సంజయ్ వెళ్లిన సమయంలోనే.. కేసీఆర్ కూడా యాదాద్రికి వచ్చి ప్రమాణం చేసేవారన్నారు తరుణ్ చుగ్. మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే.. ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఓవైపు ఫామ్‌హౌజ్ వ్యవహారం దుమారం రేపుతుంటే.. మరోవైపు యాదాద్రి ప్రమాణం పొలిటికల్‌గా మరింత మంటలు రేపుతోంది. ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..