KTR: తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబమే.. ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌

కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే అన్న కేటీఆర్..

KTR: తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబమే.. ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌
Minister KTR
Follow us

|

Updated on: Feb 23, 2023 | 9:19 PM

కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే అన్న కేటీఆర్ .. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కుటుంబమే అని అన్నారు. గురువారం భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కేసీఆర్ పాలనలో 75 ఏళ్లలో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో జరుగుతున్నాయని కేటీర్‌ కామెంట్ చేశారు. ప్రగతి భవన్‌ను పేల్చేస్తానని ఓ పిచ్చోడు.. సెక్రటేరియట్ పేల్చేస్తానని మరో పిచ్చోడు రాష్ట్రంలో తిరుగుతున్నారని, ఇటువంటి పిచ్చోళ్ల చేతిలో పార్టీలు ఉంటే రాష్ట్రానికి నష్టమని వారి నమ్మద్దని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ను ఆనుకొని ఉన్న మహారాష్ట్రకు చెందిన కొందరు సర్పంచ్‌లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వద్దకు వచ్చి మా గ్రామాలను మీ రాష్ట్రంలో కలుపుకోవాలని కోరుతున్నారని, మా దగ్గర రైతుబంధు లేదు, కరెంటు లేదు, నీళ్లు వస్తలేవు, రైతుబీమా లేదు, ఆడపిల్లల పెళ్లి చేసుకుంటు కల్యాణలక్ష్మి రాదు, వృద్ధులకు ఆసరా పింఛన్లు రావడం లేదని చెప్పి తెలంగాణలో కలుపుకోవాలని మంత్రులను కోరుతున్నారని అన్నారు. అలాగే కర్ణాటకలోని రాయ్‌చూర్‌ జిల్లాలో శివరాజ్‌పాటిల్‌ అనే బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో అమలవుతున్న పథకాలు చేయాలని, లేకుంటే రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని సమావేశాలలో కోరుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి