Telangana: ‘కాంగ్రెస్ బడ్జెట్‎ను విమర్శించే వారంతా మూర్ఖులే’: మంత్రి కోమటి రెడ్డి

రాష్ట్రంలో కృష్ణా జలాల జగడం ముదురుతోంది. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడంలో మీరంటే.. మీరే కారణమంటూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

Telangana: 'కాంగ్రెస్ బడ్జెట్‎ను విమర్శించే వారంతా మూర్ఖులే': మంత్రి కోమటి రెడ్డి
Telangana Minister Komatire
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 11, 2024 | 1:37 PM

రాష్ట్రంలో కృష్ణా జలాల జగడం ముదురుతోంది. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడంలో మీరంటే.. మీరే కారణమంటూ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. కృష్ణా జలాల పరిరక్షణ ధ్యేయంగా బీఆర్ఎస్ ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఛలో నల్లగొండ సభపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండకు తీరని అన్యాయం చేసి కేసీఆర్ నల్లగొండకు ఏ మొహంపెట్టుకొని వస్తున్నాడని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ నల్లగొండకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

దక్షిణ తెలంగాణను ఎడారి చేసింది.. కేసీఆరేనని విమర్శించారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు. ఈ నెల 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కూర్చీపై పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన చేస్తామని చెప్పారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారని, జగన్‎తో.. కేసీఆర్ కుమ్మక్కై కృష్ణా జలాలను ఏపికి ధారాదత్తం చేశారని విమర్శించారు. కృష్ణాజలాలపై కేసీఆర్ దొంగ దీక్షలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారు. కృష్ణాజలాలపై మాట్లాడే నైతిక హాక్కు కేసీఆర్, హరీష్ రావులకు లేదని మంత్రి కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ బడ్జెట్‎ను విమర్శించే వారంతా మూర్ఖులేనని అన్నారు. బడ్జెట్‎ను విమర్శిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ప్రజలు అసహ్యించుకున్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు