AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ గట్టు నుంచి ఆ గట్టుకు.. తెలంగాణలో మొదలైన ఫిరాయింపుల పర్వం..

తెలంగాణలో ప్రభుత్వం మారి రెండు నెలలు అయిందో లేదో.. అప్పుడే జంపుల సీజన్ షురూ ఐనట్టుంది. ఓవైపు బీజేపీ నుంచి ఆహ్వానాలు. 20 నుంచి 25మంది టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతల కామెంట్లు. ఇవన్నీ వెరసి బీఆర్‌ఎస్‌లో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంతకీ ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ను కారు పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది.

Telangana: ఈ గట్టు నుంచి ఆ గట్టుకు.. తెలంగాణలో మొదలైన ఫిరాయింపుల పర్వం..
Brs Bjp Congress
Srikar T
|

Updated on: Feb 11, 2024 | 7:15 AM

Share

తెలంగాణలో ప్రభుత్వం మారి రెండు నెలలు అయిందో లేదో.. అప్పుడే జంపుల సీజన్ షురూ ఐనట్టుంది. ఓవైపు బీజేపీ నుంచి ఆహ్వానాలు. 20 నుంచి 25మంది టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతల కామెంట్లు. ఇవన్నీ వెరసి బీఆర్‌ఎస్‌లో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ నడుస్తోంది. ఇంతకీ ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ను కారు పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది. కండువా మార్చాలనుకునే నేతలకు గులాబీ పార్టీ అడ్డుకట్ట వేయగలదా? బీజేపీ, కాంగ్రెస్.. ఒకటి దేశంలో అధికార పార్టీ, ఇంకోటి రాష్ట్రంలో అధికార పార్టీ దాదాపు పదేళ్లపాటు తెలంగాణను ఏలిన బీఆర్‌ఎస్.. ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారాన్ని కోల్పోయిన కారు పార్టీ.. తిరిగి పూర్వవైభవం తెచ్చుకోవాలనే ఆశతో ముందుకు సాగుతోంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు.. గోడ దూకడానికి సిద్ధమవుతున్న నేతల తీరు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది.

అధికారం దక్కించుకుని దూకుడుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. తెరవెనుక ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. ఇలాంటి సమయంలో తమ పార్టీలోకి 20 నుంచి 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ బాంబ్ పేల్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలని కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలవాలనుకుంటున్న కమలం పార్టీ.. బీఆర్‌ఎస్ నేతలనే టార్గెట్ చేసింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లింది.

గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు.. బీఆర్‌ఎస్ నేతలంతా బీజేపీలో చేరాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టి మరీ బీఆర్‌ఎస్ నేతలకు ఆహ్వానాలు పంపారాయన. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే వాళ్లిష్టం. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయన్నారు. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం లేదన్నారు కేటీఆర్. ప్రభుత్వాలు మారగానే.. రాజకీయాలు మారడం సహజం. ప్రతిపక్షంలో కూర్చోడానికి ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు అధికారపక్షం వైపు రావడం కూడా చాలా కామన్. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు ఈ జంపింగ్ ఎపిసోడ్.. రాజకీయాలను హీటెక్కిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..