Tomato Prices Crash: టమాటా ధరలు ఢమాల్.. ప్రస్తుతం కిలో ఎంతంటే?
టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దీంతో కోటి ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో సదానందం అనే రైతు ఎకరం పొలంలో టమాటా సాగు చేశాడు. కాపుకు వచ్చిన పంటను మార్కెట్ కి తీసుకెళ్తే కేవలం కిలోకు ఐదు రూపాయలు ధర ఉండటంతో..

పెద్దపల్లి, ఫిబ్రవరి 7: టమాటా ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో సదానందం అనే రైతు ఎకరం పొలంలో టమాటా సాగు చేశాడు. కాపుకు వచ్చిన పంటను మార్కెట్ కి తీసుకెళ్తే కేవలం కిలోకు ఐదు రూపాయలు ధర ఉండటంతో కనీసం ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు కూడా రాకపోవడంతో మార్కెట్లోనే పడేసి వచ్చాడు. చేతికొచ్చిన టమాట పంటను ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నాడు. మార్కెట్ కి తీసుకెళ్తే కిలో ఐదు రూపాయలు పలకడం లేదు. కూలీ రెట్లు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు కూడా రావడం లేదని పంటను కోయలేక చేనులోనే వదిలిపెట్టాడు.
దీంతో టమాటో పంట పండు పండి పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నాడు రైతు సదానందం. వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న తరహాలోనే కూరగాయలను కూడా కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు రైతు సదానందం. లేకపోతే కూరగాయలు సాగు చేసే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే తనకు లక్ష యాభై వేల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లిందని, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నాడు రైతు సదానందం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




