7 గంటల కంటే తక్కువ నిద్రపోతే మీలో వచ్చే మార్పులు ఇవే!
Anand T
02 may 2026
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్ర
ఒక వేళ ఒక వ్యక్తి రోజుకు 7 నుండి 8 గంటల కన్నా తక్కువ నిద్రపోతే వారికి క్యాన్సర్, పక్షవాతం, గుండె జబ్బులు , మధుమేహం వంటి ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్ర
నిద్రలేమి అనేది మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడేవారు తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కొంటారు. కాబట్టి రోజు 7-8 గంటల నిద్ర కచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం సమస్య
శరీరానికి అత్యవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల క్రమంగా, జ్ఞాపకశక్తి బలహీనపడటం, మతిమరుపు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
బలహీనమైన జ్ఞాపకశక్తి
మనం సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో శక్తి, సామర్థ్యం తగ్గుతాయి. అలాగే మీరు ఏ పనిచేసినా త్వరగా అలసిపోతారు. ఏదైనా విషయాన్ని గ్రహించే సామర్థ్యం కూడా తగ్గడం మొదలవుతుంది. అంతేకాదు మీరు మీపై ఏకాగ్రతను కూడా కోల్పోతారు.
శక్తి, సామర్థ్యం తగ్గుదల
నిద్రలేమి మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇది ఒక వ్యక్తిలో చిరాకు, కోపాన్ని పెంచుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
నిద్రలేమి
నిద్రలేమి కళ్ళపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలోని ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. దీన్ని వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
కంటి ఆరోగ్యం
మనం సరిగ్గా నిద్రపోకపోతే ఈ ప్రభావం ప్రత్యక్షంగా మన ఆరోగ్యంపై పడుతుంది. చర్మంపై సున్నితమైన ప్రదేశాలలో, అంటే కళ్ల కింద నల్లటి వలయాలు లేదా మచ్చలు కనిపిస్తాయి. ఇది మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గుర్తిచేస్తుంది.