AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Movie: దేవి సినిమాలో విలన్ కేరళలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

దేవి సినిమా తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ మూవీ వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో వనీతా విజయ్ కుమార్, భానుచందర్, ప్రేమ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా విలన్ పాత్రలో భయపెట్టిన నటుడు గుర్తున్నాడా.. ? నిజానికి అతడు కేరళ పోలీసు అధికారి. అతడి పేరు అబూ. ప్రస్తుతం అతడు ఏం చేస్తున్నారో తెలుసుకుందామా.

Devi Movie: దేవి సినిమాలో విలన్ కేరళలలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Devi Movie
Rajitha Chanti
|

Updated on: May 02, 2026 | 8:10 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వాడకం, అలాగే దేవి వంటి గ్రాఫిక్స్-ఆధారిత చిత్రాల నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికరమైన విషయాలను నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమకాలీన చిత్రాలు భారీ బడ్జెట్‌లతో నిర్మించినప్పటికీ, తరచుగా విఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరు, దేవి వంటి చిత్రాలలో గ్రాఫిక్స్ వాడకం అప్పటి ప్రేక్షకులను అబ్బురపరిచిందని దేవి ప్రసాద్ గుర్తు చేశారు. గ్రాఫిక్స్ వాడకం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిరిదని, తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆయన ఆకాంక్ష దీనికి మూలమని దేవి ప్రసాద్ తెలిపారు. ఈ సాంకేతికతను తెలుగు కథలకు అనుగుణంగా మార్చుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన భావించారు. ఈ ఆలోచనను కోడి రామకృష్ణ సమర్థవంతంగా అమలు చేశారు. అమ్మోరు సినిమాతో తెలుగులో గ్రాఫిక్స్ వాడకం ప్రారంభమైంది. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ ఎలా చేయాలో తెలియక, అమెరికా నుండి క్రిస్ అనే సాంకేతిక నిపుణుడిని రప్పించి, గ్రీన్ మ్యాట్ వంటి పద్ధతులు నేర్చుకున్నామని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

దేవి సినిమాకు వచ్చేసరికి గ్రాఫిక్స్ సాంకేతికత ముంబై, చెన్నైలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిందని, ముంబైలోని క్రెస్ట్ కమ్యూనికేషన్స్ దేవి సినిమా గ్రాఫిక్స్ చేశారని దేవి ప్రసాద్ తెలిపారు. అయితే, ఈ గ్రాఫిక్స్ అద్భుతంగా కనిపించడానికి కూడా బలమైన భావోద్వేగాల సృష్టియే కారణమని ఆయన అన్నారు. అలాగే దేవి సినిమా విలన్ ఎంపిక ప్రక్రియ కూడా అంతే ఆసక్తికరంగా సాగిందని తెలిపారు. తొలుత ఎం.ఎస్. రాజు గారు ఆఫ్రికా నుండి ఒక నటుడిని తీసుకువచ్చినా, అతనికి తెలుగు రాకపోవడం వల్ల ఆ పాత్రకు న్యాయం చేయలేకపోయారని దేవి ప్రసాద్ వెల్లడించారు. షూటింగ్ వైజాగ్ కు వెళ్లినప్పుడు కూడా విలన్ ఎవరనేది ఖరారు కాలేదని, చిత్రబృందం తీవ్ర ఒత్తిడిలో ఉందని తెలిపారు. ఆ సమయంలో, చిత్ర హీరో సిజు (అతను మలయాళీ) తన స్నేహితుడు, కేరళలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అబూ సలీం గురించి ఒక ఫోటో ఆల్బమ్ ద్వారా తెలియజేశారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

అబూ సలీంకు తెలుగు తెలియకపోయినా, సినిమాల పట్ల ఆసక్తి, మంచి బాడీ బిల్డర్‌ కావడంతో కోడి రామకృష్ణ వెంటనే అతన్ని పిలిపించి ఎంపిక చేశారు. అబూ సలీం ఆరడుగుల లోపే ఉన్నప్పటికీ, కెమెరా ట్రిక్స్, కాంటాక్ట్ లెన్స్, విగ్గు, రవి (బొమ్మాళి రవి) డబ్బింగ్ ద్వారా అతన్ని భారీ, భయంకరమైన విలన్‌గా చూపించారని దేవి ప్రసాద్ వివరించారు. అబు సలీం ఇప్పటికీ మలయాళీ చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

Follow Us