AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: 10 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. లేటేస్ట్ లుక్ చూశారా.. ?

ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. కానీ దాదాపు పదేళ్లుగా 10 సంవత్సరాలుగా ఒక్క సినిమా చేయలేదు. ఒక్క సినిమాతోనే తెలుగులో పాపులర్ అయిన ఆమెకు.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి మూవీ.. పోషించిన పాత్ర ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Telugu Cinema: 10 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. లేటేస్ట్ లుక్ చూశారా.. ?
Kamalini Mukharji
Rajitha Chanti
|

Updated on: May 02, 2026 | 7:38 PM

Share

సాధారణంగా సినీరంగంలో నటిగా నిలదొక్కుకోవడం అంత సులభమేమి కాదు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో సవాళ్లు.. మరెన్నో అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు మొదట్లోనే ఒకటి రెండు చిత్రాలతో పాపులర్ అయినప్పటికీ ఆ తర్వాత అంతగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న సినిమాలు చేస్తుంటారు. అలాగే సహయ నటిగా మెప్పించిన తారలు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాకుంటున్న ఓ హీరోయిన్ మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనదైన ముద్ర వేసింది. కానీ దాదాపు పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదండి. హీరోయిన్ కమలినీ ముఖర్జీ.

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..

కమలినీ ముఖర్జీ 2004లో వచ్చిన ‘ఫిర్ మిలేంగే’ చిత్రంతో హిందీ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేశారు.ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆనంద్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రానికిగానూ ఆమె ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఆనంద్, గోదావరి వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

ఆ తర్వాత ఆమె నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరులతో ‘గోదావరి’, ‘క్లాస్‌మేట్’, ‘హ్యాపీ డేస్’, ‘జల్సా’ వంటి చిత్రాలలో నటించారు. ఆమె తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషా చిత్రాలలో నటించి పాన్-ఇండియా నటిగా పేరు పొందారు. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె సినిమాలు చేయలేదు. దాదాపు పదేళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. కమలినీ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

Kamalini Mukharji News

Kamalini Mukharji News

ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.

Follow Us
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?