Corona Vaccination: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం.. ఇకపై వారికి టీకా వేయరు..!

Corona Vaccination: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీకా కోసం పేర్లు నమోదు చేసుకుని.. తీరా టీకా వేసే సమయానికి డుమ్మా..

Corona Vaccination: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం.. ఇకపై వారికి టీకా వేయరు..!
Follow us

|

Updated on: Jan 21, 2021 | 9:48 AM

Corona Vaccination: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీకా కోసం పేర్లు నమోదు చేసుకుని.. తీరా టీకా వేసే సమయానికి డుమ్మా కొట్టిన వారికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని.. నిర్దేశిత రోజున వ్యాక్సిన్ వేయించుకోని వారికి మళ్లీ టీకా వేయొద్దని డిసైడ్ అయ్యింది. వారి స్థానంలో అప్పటికప్పుడు ఇతర లబ్ధిదారులకు టీకా వేయాలని నిర్ణయించింది. తద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది.

జనవరి 16వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తొలుత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి టీకాలు వేస్తున్నారు. అందులో భాగంగా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశంలో అధికారులకు కొత్త చిక్కు ఎదురవుతోంది. వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకున్న లబ్ధిదారులు.. తీరా నిర్ధేశించి సమయం వచ్చే సరికి డుమ్మా కొడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా ప్రతిరోజు నిర్ధేశించిన టార్గెట్‌లో కేవలం 50 శాతం, మరికొన్ని చోట్ల 60 శాతం, ఇంకొన్ని చోట్ల 70 శాతం చొప్పున వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితికి చెక్ పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా యాప్‌లో తమ పేరును నమోదు చేసుకున్న లబ్దిదారులు టీకా కేంద్రానికి వచ్చి కరోనా టీకా వేసుకోబోమని చెబితే, సంబంధిత వ్యక్తి పేరు, వారి నిరాకరణను ధృవపరుస్తూ కోవిన్‌ యాప్‌లో నమోదు చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్‌లో నమోదైన తర్వాత మరోసారి సదరు వ్యక్తికి టీకాలు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.. ఈ విషయాన్ని వైద్యఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు.

Also read:

Pune Resturent: భోజనం చేయండి… బుల్లెట్‌ బైక్‌ సొంతం చేసుకోండి.. స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించిన రెస్టారెంట్‌..

ధ‌ర‌ణిలో కొత్త ఆప్ష‌న్‌… అప్లికేష‌న్ ఫ‌ర్ ల్యాండ్ మ్యాట‌ర్స్ పేరుతో స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి అవ‌కాశం…