AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: చిల్‌గా ఉండాలే.. 100కి ఫోన్ చేసి బీర్ ఆర్డర్ చేసిన యువకుడు.. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే..

పీకలదాక తాగాడు.. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు.. షాపులన్నీ మూసివేశారని.. రెండు చల్లచల్లని బీర్లు కావాలంటూ ఆర్డర్ వేశాడు.. ఈ సంఘటకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వాస్తవానికి ఈ సంఘటన పాతది.. ఇది తెలంగాణలో జరిగింది. ఓ యువకుడు పోలీసులకు 'బీర్ ఆర్డర్' చేయమని కోరుతూ.. ఫోన్ చేసిన పాత సంఘటనకు సంబంధించిన న్యూస్.. ఇటీవల తెలంగాణలో వైరల్ గా మారింది.

Fact Check: చిల్‌గా ఉండాలే.. 100కి ఫోన్ చేసి బీర్ ఆర్డర్ చేసిన యువకుడు.. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే..
Beer
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2024 | 10:12 AM

Share

పీకలదాక తాగాడు.. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు.. షాపులన్నీ మూసివేశారని.. రెండు చల్లచల్లని బీర్లు కావాలంటూ ఆర్డర్ వేశాడు.. ఈ సంఘటకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వాస్తవానికి ఈ సంఘటన పాతది.. ఇది తెలంగాణలో జరిగింది. ఓ యువకుడు పోలీసులకు ‘బీర్ ఆర్డర్’ చేయమని కోరుతూ.. ఫోన్ చేసిన పాత సంఘటనకు సంబంధించిన న్యూస్.. ఇటీవల తెలంగాణలో వైరల్ గా మారింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్తున్నట్లు కూడా ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. తెలంగాణకు చెందిన 22 ఏళ్ల వ్యక్తి 100కి డయల్ చేసి కూల్ బీర్లు ఆర్డర్ చేశాడంటూ.. పలు మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సంఘటన తెలంగాణలో జరిగింది.. కానీ.. ఇప్పటిది కాదు.. పాత సంఘటన ఆధారంగా మరలా కొంతమంది దీనిని వైరల్ చేస్తున్నారు.

నిజం ఏమిటి?:

పోలీసులకు ఫోన్ చేసి మద్యం ఆర్డర్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వార్తా కథనాలు ఉన్నాయి. ఈ సంఘటన 2022 మేలో జరిగింది.. ఇది ఇటీవలిది కాదు.

అంతేకాకుండా, వైరల్ పోస్టులో ఉపయోగించిన చిత్రం కూడా ఇప్పటిది కాదు.. ఇది సెప్టెంబర్ 2013 నాటిది.

తెలంగాణకు చెందిన 22 ఏళ్ల యువకుడు బీర్‌ను ఆర్డర్ చేయడానికి 100కి డయల్ చేస్తున్న చిత్రం వివిధ టెలిగ్రామ్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ చిత్రం చెప్పినట్లు ఇటీవల జరగలేదు..

ది క్వింట్ ప్రచురించిన కథనం ప్రకారం.. వైరల్ చిత్రం సెప్టెంబర్ 2013 నాటిది. ఇది పోలీసు సిబ్బంది ఏ రాష్ట్ర చెందినవారో స్పష్టంగా తెలియడం లేదు.

రెండు సంవత్సరాల క్రితం వార్తా నివేదిక..

“22 ఏళ్ల తెలంగాణ వ్యక్తి 100కి డయల్ చేసి, చల్లబడిన బీర్‌ను ఆర్డర్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. పోలీసులు పబ్లిక్ సర్వెంట్లంటూ వాదించాడు. ప్రజల అవసరాలను తీర్చాలని, తనకు బీరు తీసుకురావడం కూడా ‘అవసరం’ అంటూ పోలీసులతో వాదించాడు” అయితే, ఇది జరిగి రెండేళ్లు కావొస్తుంది.. ఈ ఘటనలో వికారాబాద్ జిల్లాకు చెందిన జె మధు అనే 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే