Telangana LS Polls: ‘కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..‘ KTR కామెంట్స్‌పై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?
వేములవాడ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించేవాళ్లు ఉండబోరని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే...హైదరాబాద్‌ని బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందన్నారు.

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించేవాళ్లు ఉండబోరని హెచ్చరించారు. పార్లమెంటులో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే…హైదరాబాద్‌ని బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందన్నారు. జూన్ 2 తేదీతో హైదరాబాద్‌ను ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించి 10 ఏళ్లు పూర్తవుతుందన్నారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని.. ఆ మేరకు తమకు సమాచారం ఉందన్నారు. బీజేపీ ఇలాంటి ప్రయత్నం చేస్తే.. దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తో సాధ్యంకాదన్నారు. బీఆర్ఎస్ మాత్రమే ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోగలదన్నారు. దీని కోసం పార్లమెంటులో బీఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసరమని పేర్కొన్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 12 సీట్లు గెలిస్తే… ఏడాదిలోగా కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే… రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయంటూ కేటీఆర్ సంకేతాలిచ్చారు. ఇక రాముడు అందరివాడు…ఆయన బీజేపీకి మాత్రమే సొంతం కాదన్నారు. మనం కూడా జై భారత్, జై శ్రీరామ్ అందామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశముందంటూ కేటీఆర్ చేసిన ఈ కామెంట్లతో తెలంగాణ దంగల్‌లో కాక రేపుతున్నాయి.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చనున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తామని కొట్టిపారేశారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి. ఇవాళ లాలాగూడ, ఇందిరానగర్‌లో గెలిపే లక్ష్యంగా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమని స్పందించారో వీడియో చూడండి..




