Kavitha MLC Resignation: రాష్ట్రంలో త్వరలోనే మరో ఉప ఎన్నిక! కవిత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండలి ఛైర్మన్
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించారు. బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్‌లోనే ఆమె రాజీనామా చేయగా.. తాజాగా ఆమోదం లభించింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాం చోటుచేసుకుంది. తన MLC పదవికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత.. గత ఏడాది సెప్టెంబర్ 3న తన పదవికి రాజీనామా చేస్తూ ఛైర్మన్‌కు లెటర్ ఇవ్వగా తాజాగా కవిత రాజీనామా ఆమోదంపై నోటిఫికేషన్ జారీ చేశారు లెజిస్లేటివ్ సెక్రటరీ.
కవిత ఎందుకు రాజీనామా చేసింది?
BRS పార్టీ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్‌లోనే పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం మండలిలో మాట్లాడిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.
భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని మండలి ఛైర్మన్ సూచించినప్పటికీ.. తాజాగా జరిగిన మండలిలో ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. కవిత రాజీనామాను ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
