Telangana: గత ఐదేళ్లలో తెలంగాణ ఎలాంటి విదేశీ రుణాలు తీసుకోలేదు.. రేవంత్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం..

గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ నుంచి రుణ సహాయం అందలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తమ్మీద రూ. 2,37,747 కోట్ల రుణభారం ఉందని

Telangana: గత ఐదేళ్లలో తెలంగాణ ఎలాంటి విదేశీ రుణాలు తీసుకోలేదు.. రేవంత్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి  సమాధానం..
Follow us

|

Updated on: Dec 20, 2021 | 3:36 PM

గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ నుంచి రుణ సహాయం అందలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తమ్మీద రూ. 2,37,747 కోట్ల రుణభారం ఉందని, ఇందులో రూ. 2,835 కోట్లు విదేశాల నుంచి తీసుకున్నవేనని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి పేర్కొన్నారు. ఈమేరకు పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా సోమవారం కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అడిగన ప్రశ్నకు పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

‘గత ఐదేళ్లలో విదేశీ రుణాల రూపంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి అదనపు సహాయం అందలేదు. రూ. 382.21 కోట్ల మేర విదేశీ రుణాలు, రూ. 147.53 కోట్ల మేర వడ్డీ చెల్లింపులను తెలంగాణ ప్రభుత్వం జరిపింది. జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్‌ తెలంగాణకు రుణ సహాయం అందించాయి’ అని పంకజ్‌ చౌదరి పేర్కొన్నారు.

Also Read:

Jagananna Housing Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. సంపూర్ణ గృహ హక్కు పథకంపై కీలక ఉత్తర్వులు..

Andhra Pradesh: బంపర్‌ ఆఫర్‌.. అక్కడ మటన్‌ కేజీ 50 రూపాయలే.. ఎగబడ్డ స్థానికులు

Bandi Sanjay: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వెంటనే పునరుద్ధరించాలిః బండి సంజయ్