AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జూనియర్‌ కాలేజీల్లో 1,654 గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు) నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌..

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జూనియర్‌ కాలేజీల్లో 1,654 గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్
CM KCR
Srilakshmi C
|

Updated on: Jul 19, 2023 | 1:57 PM

Share

హైదరాబాద్‌, జులై 19: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు) నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం (జులై 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన నియామక మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. జూనియర్‌ కాలేజీల్లో ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌కు నిమిత్తం రూ.390 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన నెలకు రూ.28,080 చొప్పున వేతనం అందించనున్నట్లు వెల్లడించింది.

జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీ ఏర్పాటు చేస్తారు. జిల్లాల్లోని జూనియర్‌ కాలేజీల వారీగా ఖాళీలను ఈ రోజు వెల్లడిస్తారు. అర్హతలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 26వ తేదీన మెరిట్‌ జాబితా వెల్లడిస్తారు. ఎంపికైన గెస్ట్‌ లెక్చరర్ల జాబితా ఈ నెల 28న జిల్లా కలెక్టర్‌ వెల్లడిస్తారు. ఆగస్టు 1న సంబంధిత కాలేజీల ప్రిన్సిపాళ్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గతంలో జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లుగా ఉన్న వారిని తిరిగి కొన సాగించకపోవడంతో వారిలో ఆందోళన నెల కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి