Tamilisai Soundararajan: తప్పుడు సమాచారం ఇచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం.. నిందితులను కఠినంగా శిక్షించాలి..

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని..

Tamilisai Soundararajan: తప్పుడు సమాచారం ఇచ్చి నిందితులను కాపాడే ప్రయత్నం.. నిందితులను కఠినంగా శిక్షించాలి..
Governor Tamilisai
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2023 | 3:05 PM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ లేఖ రాశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల్లో యాంటి రాగింగ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా మెడికో లకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనల లో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీ లలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రీతి మృతి చాలా బాధాకరం. మెడికల్ కాలేజీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి వంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలి. కౌన్సెలింగ్ సెంటర్ లు కూడా మహిళా మెడికో ల కు ఏర్పాటు చేయాలి. మెడికల్ కాలేజీల్లో యాంటి రాగింగ్ చర్యలు తీసుకోవాలి.

       – తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ గవర్నర్

ఇవి కూడా చదవండి

కాగా.. అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన వరంగల్ ఎమ్‌జీఎమ్ హాస్పిటల్‌లో మెడిసిన్ చేస్తున్న ప్రీతి ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని.. రూ. 30 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేశారు వైద్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ