తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం.. ప్రముఖుల సంతాపం..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృవియోగం.. ప్రముఖుల సంతాపం..
Tamilisai Soundararajan Mother

Tamilisai Soundararajan Mother Death: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణ కుమారి (80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న

Shaik Madarsaheb

|

Aug 18, 2021 | 8:50 AM

Tamilisai Soundararajan Mother Death: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తల్లి కృష్ణ కుమారి (77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్‌ భార్య. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆమె పెద్ద కూతురు. కాగా.. గవర్నర్‌ తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. గవర్నర్ కుటుంబసభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మరణం పట్ల ఆర్థిక మంత్రి టి. హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

Also Read:

Neem Leaves Benefits: రుచిలోనే చేదు.. ఆరోగ్య ప్రయోజనాల్లో రారాజు.. వేపాకు లాభాలు తెలిస్తే షాకే..

Garlic Tea Benefits: వెల్లుల్లి టీ తాగితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవుతారు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu