Telangana: ఇళ్లులేని వారికి ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. డబుల్ బెడ్‌రూమ్‌ల విషయంలో కీలక నిర్ణయం!
Double bedroom houses: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరు పేదలకు త్వరలోనే ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లులేని నిరుపేదలకు రూ.ఆర్థిక సాయం అందిస్తోన్న ప్రభుత్వం.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డబుల్‌బెడ్‌రూమ్‌ల నిర్మాణాలను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి పూర్తి చేసి ప్రజలకు అప్పగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా శుక్రవారం జారీ అయ్యాయి.

రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంది. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం అన్ని నియోగజకవర్గాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు కూడా తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే తొలి దశలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లు అందుబాటులోకి కూడా రానున్నాయి. ఇక దీనితో పాటు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుతం మధ్యలోనే ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం తాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు పలు ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న డబుల్ బెడ్ రూం ప్రాజెక్టులను ఇకపై తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏఏ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయో.. వాటని గుర్తించి త్వరితగితా వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే వాటిని లబ్ధదారులకు అందించే ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది.
తాజా ప్రభుత్వ నిర్ణయం తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాజెక్టులను సంబంధిత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అలాగే గ్రేటర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ కమిషనర్‌కు బదిలీ చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారులకు కేటాయింపు ప్రక్రియలో గతంలో విడుదల చేసిన జీవో నంబర్ 33లోని మార్గదర్శకాలనే పాటించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
