Hyderabad: ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన గ్యాంగ్.. ఆపి చెక్ చేయగా.. వామ్మో..
హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయిలో గంజాయి పట్టివేత కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. వీటిని తరలిస్తున్న మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఏడుగురు ప్రయాణికుల డీఆర్ఐ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 9.5 కోట్ల విలువైన 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు గంజాయిని అక్రమంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చెకింగ్ పాయింట్ వద్ద వారి ప్రవర్తణపై అనుమానం రావడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది వారి లగేజ్‌ను చెక్ చేశారు.
అయితే వారి వద్ద ఉన్న సూట్‌కేసులలో దాచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సిబ్బంది గుర్తించారు. వెంటనే డీఆర్ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సూట్‌కేసులో దాచి తరలిస్తున్న సుమారు.27.15 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ బహింర మార్కటెల్‌లో సుమారు రూ.9.5కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీడియో చూడండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
