కోఠి ఎస్‌బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది
హైదరాబాద్ కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారి రిన్షద్‌పై కాల్పులు జరిపి, 6 లక్షల రూపాయల నగదుతో ఇద్దరు నిందితులు ఉడాయించారు. పక్కా ప్రణాళికతో వచ్చిన దుండగులు సీసీ కెమెరాల్లో రికార్డయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద తెల్లవారుజామున కాల్పులు, దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 6:50 నుండి 7:00 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో వస్త్ర వ్యాపారి రిన్షద్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి, ఆయన వద్ద ఉన్న 6 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిన్షద్‌ను నిందితులు ముందుగానే గమనించారు. సీసీ కెమెరాల ఫుటేజీని బట్టి, నిందితులు పక్కా ప్రణాళికతోనే వచ్చారని, గన్‌తో దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. ఒక నిందితుడు బైక్‌పై సిద్ధంగా ఉండగా, మరొకరు రిన్షద్‌పై కాల్పులు జరిపి, కాలికి గాయం చేసి, డబ్బుల బ్యాగును లాక్కొని ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్
Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట
Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్
Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?
Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

